Viral Video: దొంగతనానికే ఇది పరాకాష్ట.. మహిళ చేతి వాటం చూస్తే దిమ్మ తిరగాల్సిందే..

Viral Video: దొంగలు రోజు రోజుకీ తెలివి మీరి పోతున్నారు. ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా చేతి వాటం చూపిస్తున్నారు. ఎవరు లేని సమయంలో ఇళ్లలోకి దూరి దొంగతనం చేయడం సర్వసాధారణమే. అయితే...

Viral Video: దొంగతనానికే ఇది పరాకాష్ట.. మహిళ చేతి వాటం చూస్తే దిమ్మ తిరగాల్సిందే..
Follow us
Narender Vaitla

|

Updated on: May 16, 2022 | 1:46 PM

Viral Video: దొంగలు రోజు రోజుకీ తెలివి మీరి పోతున్నారు. ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా చేతి వాటం చూపిస్తున్నారు. ఎవరు లేని సమయంలో ఇళ్లలోకి దూరి దొంగతనం చేయడం సర్వసాధారణమే. అయితే అందరూ చూస్తుండగా, దొంగతనం చేయడం మాత్రం కష్టం, కానీ కొందరు తెలివి మీరిన దొంగలు మాత్రం చాకచక్యంగా దోపీడి చేస్తుంటారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో జేబు దొంగల చేతి వాటం చూస్తే మోసపోయిన వారు కూడా దొంగల పని తీరుకు కొన్ని సార్లు హ్యాట్సాఫ్‌ చెప్పక మానరు. అంతలా తమ చోర కళను ప్రదర్శిస్తుంటారు.

అయితే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతీ చోట సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి రావడంతో దొంగలు ఇట్టే దొరికి పోతున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఓ దొంగతనం వీడియో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే ఓ వృద్ధ మహిళ ఒక షాప్‌ వద్ద నిల్చొని ఉంది. షాపు యజమానితో ఏదో వస్తువు గురించి మాట్లాడుతోంది. అంతలోనే అక్కడికి మరో వృద్ధ మహిళ వచ్చింది. వచ్చి రాగానే అప్పటికే అక్కడ ఉన్న మహిళ బ్యాగ్‌పై కన్నేసింది.

ఇవి కూడా చదవండి

గందరగోళానికి గురి చేసి సదరు మహిళ బ్యాగు జిప్‌ను తెరిచింది. తర్వాత షాప్‌ యజమానితో మాట్లాడుతూ.. బ్యాగ్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్‌ను కొట్టేసి ఎంచక్కా బ్యాగులో వేసుకొని అక్కడి నుంచి తుర్రుమని వెళ్లిపోయింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ టీవీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో ఆ మహిళ చేతి వాటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సదరు మహిళ చోర కళను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?