Telugu News Trending Optical illusion photo Can you find there is a second tiger in this photo
Viral Photo: ఈ ఫొటోలో ఉన్న రెండో చిరుత తల ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.. ఎంత వెతికినా కనిపించట్లేదా.?
Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎన్నో ఆసక్తికర అంశాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అద్భుతంగా ఉండే వీడియోలు కొన్ని అయితే ఆశ్చర్యాన్ని కలిగించే..
Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎన్నో ఆసక్తికర అంశాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అద్భుతంగా ఉండే వీడియోలు కొన్ని అయితే ఆశ్చర్యాన్ని కలిగించే ఫొటోలు మరికొన్ని. ఇలా నిత్యం ఏదో ఒక అంశం నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలా ట్రెండ్ అవుతోన్న అంశాల్లో ఆప్టికల్ ఇల్యూజన్ ఒకటి. చూసే కళ్లను సైతం మోసం చేసేలా ఉండే ఫొటోలు నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతోంది.
పైన కనిపిస్తున్న ఫొటోలో చెట్టుపై ఓ చిరుత కూర్చొని ఉంది అది స్పష్టంగా కనిపిస్తోంది కదూ! అయితే అందులో మరో చిరుత దాగి ఉంది కనిపెట్టారా.? వెనకల మరో చిరుత కూడా ఉంది. చెట్టు కింది భాగంలో దాని తోక కనిపిస్తుంది. మరి దాని తల ఎక్కడ ఉందో కనిపించిందా.? ఎంత ప్రయత్నించినా కనిపించడం లేదు కదూ! అయితే ఓసారి రెండు చెట్ల మధ్య తీక్షణంగా గమనించండి ఓ చిన్న చిరుత నక్కి నక్కి చూస్తోంది.
ఈ అద్భుతమైన ఫొటోను ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. దీంతో నెటిజన్లు ఈ ట్వీట్‌ను పోస్ట్ చేస్తూ ఇందులోని ఆ రెండో చిరుతను గుర్తించండి అంటూ క్యాప్షన్ పెడుతున్నారు. ఇంతకీ మీకు ఆ చిరుత కనిపించిందా లేదా.? ఒకవేళ కనిపించకపోతే కింది ఫొటోపై ఓ లుక్కేయండి..