Viral: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వింత.. ఆ గుట్ట పైకి ఎక్కితే రంగు మారుతున్న మనుషుల శరీరాలు..!

Viral: విశ్వం టెక్నాలజి వైపు దూసుకెళ్తున్నా.. ఇప్పటికి అంతుచిక్కని రహస్యలు సృష్టిలో ఎన్నో దాగి ఉన్నాయి. రహస్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాడాని పరిశోధనలు..

Viral: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వింత.. ఆ గుట్ట పైకి ఎక్కితే రంగు మారుతున్న మనుషుల శరీరాలు..!
Rasi Gutta
Follow us
Shiva Prajapati

|

Updated on: May 16, 2022 | 7:00 AM

Viral: విశ్వం టెక్నాలజి వైపు దూసుకెళ్తున్నా.. ఇప్పటికి అంతుచిక్కని రహస్యలు సృష్టిలో ఎన్నో దాగి ఉన్నాయి. రహస్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాడాని పరిశోధనలు కోసాగుతునే ఉన్నాయి. కోందరు సైన్స్ పేరితే. .మరికోందరు గాడ్ ట్విస్ట్ అంటుంటారు. ఓ గుట్ట వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని చాలమంది అనుకుంటున్నాప్పటికి అది రహస్యంగా ఉంది. అయితే ఆ గుట్టపైకి వెళ్లిన వారు రంగు మారుతారనేది వినడానికి వింతగా అనిపించిన అది మాత్రం నిజం.

సైన్స్‌కు సైతం అంతుచిక్కని రహస్యాలు సృష్టిలో చాల ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి పరిశోధనలు కోనసాగుతున్నప్పటికి.. పరిశోధకులు చెప్పె మాటలు విశ్వసించని వారంతా దేవుడి మహిమాగానే భావిస్తుంటారు. అయితే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాసి గుట్ట పైకి వెళ్తే మనిషి శరీరం రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఏ గుట్ట పైకి వెళ్లిన శరీర రంగులు మాత్రం మారవు. కాని రాసి గుట్ట పైకి వెళ్తే మాత్రం శరీరం రంగులు మారతుండం మాత్రం అందరిని షాక్ కి గురి చేస్తుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని గుంటపల్లి చెరువు సమీపాన మూడు కిలోమీటర్ల దూరంలో రాసిగుట్ట ఉంది. ఈ గుట్ట పైన మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. శ్రీ ఆంజనేయ స్వామి వారిని దాసాంజనేయ స్వామి అని కూడా పిలుస్తుంటారు వీర్నపల్లి వాసులు. స్వామివారిని దర్శించుకునే వ్యక్తి శరీరంలోని కాళ్ళు, చేతులు పసుపు రంగులోకి మారిపోతున్నాయి. అసలు గుట్ట పైకి వస్తే ఎందుకు రంగులు మారుతారయనేది చాల మందికి అర్ధం కాని విషయం. ఇందులో ఏదో మిస్టరీ ఉందనేది మాత్రం రాసి గుట్ట పైకి వెళ్లి వచ్చిన వారికి మాత్రం భోధపడుతుంది.

ఇవి కూడా చదవండి

రాసి గుట్ట పైకి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. దట్టమైన అడవిలో మూడు కిలో మీటర్లు రాళ్ల మీద నడక ప్రయాణం కోనసాగిల్సిందే. నిలువుగా గుట్ట పైకి ఎక్కాలంటే కష్ట సాధ్యమైనప్పటికి దేవుడి మహిమ చూడడానికి చాల మంది రాసి గుట్టకు తరలి వస్తుంటారు. రాసి గుట్ట పైనున్న స్వామివారిని దర్శించుకోవాలంటే మూడు కిలోమీటర్లు అడవిలో ప్రయాణం చేసి సాహసోపేతంగా గుట్టను ఎక్కి స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో సరైన రోడ్డు మార్గం ఉండదు. అడవి జంతువుల భయం వెంటాడుతునే ఉంటుంది. రాళ్ల మధ్య నడుచుకుంటూ గుట్టను ఎక్కాలంటే మాత్రం ఓ సాహసమనే చెప్పుకోవాలి.

సైన్స్‌కు సైతం అంతుచిక్కని రహస్యాలు రాసి గుట్టపై ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. గుట్టపై ఉన్న హనుమంతుడు చాలా శక్తివంతమైన దేవుడిగా ప్రసిద్ధి చెందడంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అంజన్నను దర్శించుకుంటారు. రాసి గుట్ట పైకి వెళ్లిన తరువాత శరీరం రంగు మారుతుంటుంది. కాళ్లు పసుపు రంగులో, చేతులు ఎరుపు రంగులోకి మారుతుంటాయి. ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన వారంత ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఇదంతా ఆంజనేయ స్వామి మహిమే అంటున్నారు రాసి గుట్టను చూసిన వారంతా.

శరీరం రంగులు మారేది స్సష్టంగా కనిపించాలంటే ఉదయం 11 గంటల వరకు గుట్టపైకి వెళ్లాలి. అప్పుడు కాళ్లు, చేతులు రంగు మారే దృశ్యాన్ని స్సష్టంగా చూసుకోవచ్చు. గుట్ట ఎక్కె వరకు శరీరమంతా మాములు రంగులోనే ఉంటుంది. ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుకోగానే శరీర రంగులో మార్పు కనిపించడం మొదలవుతుంది. నిమిషాల్లో పాదాలు పసుపు రంగులోకి మారిపోతుంటాయి. అయితే శరీర రంగులు మారే విషయంలో పరిశోధనలు కోనసాగినప్పటికి.. కోంత మంది రాళ్ల స్వభావంతోనే అలా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఆ మాటలతో స్థానికులు ఏకీభవించడం లేదు. దశాబ్ద కాలంగా రాసి గుట్ట రహస్యం తెలియక అంజన్న మహిమాగానే భావిస్తున్నారు భక్తులు.

దేవుడి మహిమ అని చెప్తున్నాప్పటికీ శరీరం రంగులు మారడం వెనుక ఏదోక సీక్రెట్ ఉంది. అదేంటి అనేది చాల మందిని ఆలోచింపచేస్తుంది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని చాల మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గుట్ట పైకి వెళ్తే రంగులో కాదు.. అక్కడ ఉన్న ఓ తోండ సైతం అంజన్న రంగుగా భావించే కాషాయం రంగులోనే కనిపించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

పూర్వం కథనం.. పూర్వం ఈ గుట్టపై నిలువెత్తు బండరాయి ఉండేదట దానిని దైవ స్వరూపంగా భావించేవారని, ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలకు నిలువెత్తు బండరాయి కంపించి విరిగిపోయిందట. దీంతో గ్రామ ప్రజలు సిద్ధాంతుల వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో నిలువెత్తు బండరాయి స్థానంలో హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని చెప్పారట. ఇక మరో అంశం కూడ ప్రాచుర్యంలో ఉంది. హనుమంతుడు సంజీవని పర్వతం మోసుకెళ్తున్న క్రమంలో ఓ చిన్న ముక్క జారిపడి కొండగట్టుగా వెలిసిందని.. అదే క్రమంలో ఈ ప్రాంతంలో కూడా ఓ చిన్న ముక్క పడి రాసి గుట్టగా వెలిసిందని ఈ ప్రాంత వాసుల ప్రతీతి. అయితే ఒకప్పుడు తూపాన్ కారణంగా హనుమాన్ విగ్రహం విరిగి పోవడంతో ఈ ప్రాంతంలో కరువు తాండవిల్లిందట. తిరిగి విగ్రహ ప్రతిష్ట చేయడంతో సస్య శ్యామలంగా మారిందని గ్రామస్తులు చెప్తున్నారు.

ఈ పరిసర ప్రాంతాల్లో ఎంత వేసవి అయినా నీరు పుష్కలంగా ఉంటుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. రాసి గుట్ట సమీపంలో సిద్ధులు, ఋషులు తపస్సు చేసుకునే వారని, వారు నీటి గుండాన్ని, బావిని ఏర్పాటు చేశారని, సంవత్సరాలు గడచినా అందులో నీరు మాత్రం ఇంకిపోదని.. అది దైవ స్వరూపం అని భక్తులు అంటున్నారు. వర్షాకాలంలో అద్భుతమైన జలం పాతం దర్శనమిస్తోంది. దట్టమైన అడవిలో ఈ ఆలయం ఉండడంతో ఆధ్యాత్మికం, పర్యాటకం, ప్రకృతికి నిలువుటద్దంగా రాసి గుట్ట నిలుస్తోంది.

రాసి గుట్ట పైన హనుమాన్ విగ్రహం పై సూర్య,చంద్ర గుర్తులున్నాయి. గుట్టను కంచర్ల గ్రామం వైపు నుంచి చూస్తే లింగాకరంగా కనిపిస్తుంటుంది. గుట్ట కింద కోలనుతో పాటుగా చుట్టు చెరువులున్నాయి. రమణ మహర్షి తపస్సు చేసిన అరుణచలంలోని తిరువన్నమలై లో ఉన్న గుట్ట మాదిరిగానే వీర్నపల్లి లోని రాసి గుట్ట ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే రాసి గుట్టకు ఘనమైన ప్రాచీన చరిత్ర ఉందనేది వాస్తవమైనప్పటికి…ఆ చరిత్ర కాలగర్బంలో కలిపి పోయింది. ఆ చరిత్ర మిగిలి ఉంటే రాసి గుట్ట పైన రంగులు ఎందుకు మారుతారయనేది చాల మందికి తెలిసే అవకాశం ఉండేది. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. చరిత్ర కారులు పరిశోధనలు చేసి గుట్టపైన అధ్యయనం చేస్తే చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశాలుంటాయి.

రాసి గుట్ట పైన శరీరం రంగులు మారడమే కాదు.. ఇక్కడ లభించే రాళ్లను ప్రసాదంగా భావించి తింటుంటారు. అవును వినడానికి వింతగా అనిపించి వచ్చు. రాసి గుట్టపై ఉండే రాళ్లు తేలికపాటిగా ఉండి చిన్నపిల్లలు రాసుకోవడానికి, తినడానికి వాటిని ఉపయోగించడం విశేషం. వాటిని రాసి గుట్ట బలపాలు అని పిలుస్తుంటారు. కాలితో తాకితే గరుకుగాను గట్టిగానూ రాయి వలే ఉన్నప్నపటికి నోట్లో వేసుకుంటే మాత్రం మెత్తగా తీయని రుచి వస్తుంది.

మొత్తంగా.. ఈ రాసి గుట్ట రహస్యం తెలియాలంటే.. ఇక్కడి రాళ్లపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తేనే అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ అంశం సైన్స్‌తో ముడిపడి ఉందని, భవిష్యత్‌తో ఈ రహస్యం బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?