Leopard-Hyena: వాయమ్మ..! చిన్న శబ్ధానికే హడలిపోయిన చిరుత.. ఏం చేసిందో చూడండి..
అడవిలో జంతు ప్రపంచం చాలా వింతగా ఉంటుంది. ఇటీవల జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఓ చిరుతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అడవిలో జంతు ప్రపంచం చాలా వింతగా ఉంటుంది. ఇటీవల జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఓ చిరుతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. సాధారణంగా అడవిలోని మిగతా జంతువులను హడలెత్తించే చిరుత.. ఓ చిన్న జీవి చేసిన శబ్ధానికే హడలిపోయి, గబగబా చెట్టెక్కేసింది. ఓ చిరుత పులి అప్పుడే ఓ జింకను వేటాడింది. మాంచి ఆకలి మీదున్నట్లుంది ఆదరాబాదరాగా తింటోంది. ఇంతలో హైనా శబ్ధం చేయడంతో చిరుత హడలిపోయింది. వెంటనే తను వేటాడుకున్న ఆహారాన్ని తీసుకుని చకచకా చెట్టు ఎక్కేసింది. అయితే, హైనా ఎక్కడ తన ఆహారాన్ని ఎత్తుకెళ్తుందోననే భయంతోనే చిరుత చెట్టుపైకి ఎక్కినట్లు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: పెళ్లిలో వధువు కునుకుపాట్లు.! పాప.. పెళ్లి నీదే అంటున్న నెటిజన్లు..
Nap At Office: హాయిగా ఆఫీసులోనే నిద్రపోవచ్చు..! ఇది కంపెనీ ఆఫర్..! మీరేమంటారు మరి..!
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..