Accident: అమెరికా ఆశలను చిదిమేసిన అతివేగం.. పది రోజుల్లో ఫ్లైట్‌ ఎక్కాల్సి ఉండగా..

Accident: ఆ కుర్రాడు మరో పది రోజుల్లో అమెరికా వెళ్లాల్సి ఉంది. కోటి కలలతో, పై చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లాలనుకున్నాడు. కానీ అంతలోనే జరిగిన ఓ అనుకోని సంఘటన ఆ కుర్రాడి నిండు నూరేళ్ల జీవితాన్ని...

Accident: అమెరికా ఆశలను చిదిమేసిన అతివేగం.. పది రోజుల్లో ఫ్లైట్‌ ఎక్కాల్సి ఉండగా..
Follow us
Narender Vaitla

|

Updated on: May 16, 2022 | 11:01 AM

Accident: ఆ కుర్రాడు మరో పది రోజుల్లో అమెరికా వెళ్లాల్సి ఉంది. కోటి కలలతో, పై చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లాలనుకున్నాడు. కానీ అంతలోనే జరిగిన ఓ అనుకోని సంఘటన ఆ కుర్రాడి నిండు నూరేళ్ల జీవితాన్ని అద్యాంతరంగా ముగిసేలా చేసింది. అతని తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. మనసును కలిచివేసే ఈ సంఘటన సిద్ధపేట జిల్లాల్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కోహెడ్‌ మండలం పరివేద గ్రామానికి చెందిన చాడ రఘునందన్‌ రెడ్డి (24), గవ్వ రాందివాకర్‌రెడ్డి అనే మరో కుర్రాడితో కలిసి పని నిమిత్తం ఆదివారం కోహెడకు కారులో బయలుదేరాడు.

రాందివాకర్‌ రెడ్డి కారు నడుపుతున్న సమయంలో పరివేద గ్రామం దాటగానే ఒక్కసారిగా అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న పొలాల్లోకి దొర్లుకుంటూ వెళ్లి బోల్తా కొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయి. వెంటనే రాందివాకర్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులకు విషయాన్ని ఫోన్‌లో తెలియజేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న వారు చికిత్స నిమిత్తం ఇద్దరినీ కరీంనగర్‌కు తరలించారు. అయితే రఘునందర్‌ రెడ్డి మార్గమధ్యంలోలోనే చనిపోయాడు. రాందివాకర్‌ రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

విషయం తెలుసుకున్న రఘునందన్‌ రెడ్డి దల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఇంకో 10 రోజుల్లో అమెరికా వెళ్లా్ల్సిన కుమారుడు విగత జీవిగా మారడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉంటే రఘునందర్‌ తండ్రి సంప్‌ రెడ్డికి ఒక కూతురు, కుమార్తె సంతానం. ఇటీవల బీటెక్‌ పూర్తి చేసిన రఘునందన్‌ను పై చదువుల కోసం అమెరికా పంపించాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని మరో 10 రోజుల్లో అమెరికా ఫ్లైట్‌ ఎక్కాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడం స్థానికంగా కూడా తీవ్ర విషాధాన్ని నింపింది.

మరిన్ని క్రైమ్ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?