Viral Video: మసాలా మ్యాగీ గురించి వినుంటారు.. కానీ మ్యాంగో మ్యాగీ గురించి తెలుసా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: 64 కళల్లో వంట చేయడం కూడా ఒక కళ అంటారు. సాధారణ వంటకాలకే తమదైన ప్రత్యేకతను జోడించి కొందరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. రకరకాల ప్రయోగాలు చేస్తూ వంటలకు కొత్తదనం అద్దుతుంటారు...

Viral Video: మసాలా మ్యాగీ గురించి వినుంటారు.. కానీ మ్యాంగో మ్యాగీ గురించి తెలుసా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..
Follow us
Narender Vaitla

|

Updated on: May 16, 2022 | 12:01 PM

Viral Video: 64 కళల్లో వంట చేయడం కూడా ఒక కళ అంటారు. సాధారణ వంటకాలకే తమదైన ప్రత్యేకతను జోడించి కొందరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. రకరకాల ప్రయోగాలు చేస్తూ వంటలకు కొత్తదనం అద్దుతుంటారు. అయితే ఇందుకోసం పెద్దపెద్ద షెఫ్‌లే కానక్కర్లేదు రోడ్డు పక్కన బండి పెట్టుకొని వ్యాపారం చేసే వారు కూడా మినహాయింపు ఏం కాదు. వెరైటీ డిషెస్‌తో వినియోగదారులను తమవైపు తిప్పుకుంటుంటారు. అయితే ఒకప్పుడు ఇలాంటి వంటకాలు పెద్దగా ప్రపంచానికి తెలిసేవి కావు. కానీ ఏమంటూ సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి అందరికీ తెలిసిపోతున్నాయి.

ముఖ్యంగా యువత ఏమాత్రం భిన్నంగా కనిపించినా సరే వెంటనే తమ ఫోన్‌లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు కాస్త నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోను సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. సాధారణంగా మ్యాగీని ఎలా తయారు చేస్తారు.? ఏముంది మసాలతో చేస్తారు అంటారా.? మరి అలా కాకుండా మామిడి పండ్లతో చేస్తే ఎలా ఉంటుంది.? అదేంటి మామిడి పండ్లతో మ్యాగి ఏంటని ఆశ్చర్యపోతున్నారా. కానీ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఓ వీడియో చూస్తే మీరు కచ్చితంగా నమ్మి తీరుతారు.

ఇవి కూడా చదవండి

రోడ్డు పక్కన మ్యాగీ సెంటర్‌ పెట్టుకున్న ఓ మహిళ మొదట అందరూ చేసినట్లే మసాలతో మ్యాగీ చేసింది. అయితే అందులో అదనంగా మామిడి పండ్లతో చేసే ఫ్రూటీని యాడ్‌ చేసింది. అంతటితో ఆగకుండా మామిడి పండును ముక్కలు ముక్కలుగా చేసి ఉల్లిపాయ జల్లినట్లు మ్యాగిపై వేసింది. అంతేనా.. చివరికి సాస్‌కు బదులుగా కూడా ఫ్రూటీనే వేసింది. వీడియో ఆశ్చర్యంగా ఉంది కానీ మరి టేస్ట్‌ ఎలా ఉంటుందో తిన్న వారికే తెలియాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?