McDonald-Russia: రష్యాకు మరో బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన మరో ప్రముఖ కంపెనీ..!

McDonald-Russia: రష్యాలో మెక్‌డోనాల్డ్స్‌ షెట్టర్‌ క్లోజ్‌ చేసింది. ఉక్రెయిన్‌పై అమానుష దాడులను నిరసిస్తూ అమెరికా దిగ్గజ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

McDonald-Russia: రష్యాకు మరో బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన మరో ప్రముఖ కంపెనీ..!
Putin
Follow us
Shiva Prajapati

|

Updated on: May 17, 2022 | 7:33 AM

McDonald-Russia: రష్యాలో మెక్‌డోనాల్డ్స్‌ షెట్టర్‌ క్లోజ్‌ చేసింది. ఉక్రెయిన్‌పై అమానుష దాడులను నిరసిస్తూ అమెరికా దిగ్గజ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపారాలను అమ్మేస్తున్నట్లు ప్రకటించింది. రష్యావ్యాప్తంగా ఉన్న 850 రెస్టారెంట్ల అమ్మకాల ప్రక్రియను ప్రారంభించింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించిన తర్వాత మాస్కో నుంచి వైదొలుగుతోన్న మరో అతిపెద్ద వెస్ట్రన్ కార్పొరేషన్ ఇది. రష్యాలో వ్యాపారాలు నిర్వహించడమనేది ఆమోద యోగ్యం కాదని, మెక్‌డొనాల్డ్స్ విలువలకు ఇది అనుగుణంగా లేదని కంపెనీ చెప్పింది. చికాగోకు చెందిన ఈ కంపెనీ మార్చి ప్రారంభంలోనే రష్యాలో స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపింది. అప్పటి నుంచి ఆ స్టోర్లలో పనిచేసిన ఉద్యోగులకు శాలరీస్‌ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ వర్కర్లను నియమించుకునే రష్యన్ కొనుగోలుదారు కోసం చూస్తున్నట్టు మెక్‌డొనాల్డ్స్ ప్రకటించింది. ఈ అమ్మకపు ప్రక్రియ ముగిసే వరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని మెక్‌డొనాల్డ్స్ తెలిపింది.

మెక్‌డొనాల్డ్స్‌లో అంకితభావంతో పనిచేసే 62 వేల మంది ఉద్యోగులకు, రష్యన్ సప్లయిర్స్ తాము వైదొలగడం నిజంగా కష్టతరమైన విషయమని కంపెనీ చెప్పింది. కానీ వ్యాపారాలు కొనసాగించడం మాత్రం కంపెనీ విలువలకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. కంపెనీ విలువలకే తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. మూడు దశాబ్దాల క్రితం మాస్కో మధ్యలో మెక్‌డొనాల్డ్స్ తొలి స్టోర్‌ను ఏర్పాటు చేసింది. సోవియట్ యూనియన్‌లో తెరిచిన తొలి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్సే. పశ్చిమ దేశాల ఆంక్షలతో మెక్‌డొనాల్డ్స్‌తో పాటు ఇతర అమెరికన్ ఫుడ్, బెవరేజ్ దిగ్గజాలు కోకా కోలా, పెప్సి, స్టార్ బక్స్ వంటివి కూడా రష్యాలో కార్యకలాపాలను మూసివేస్తున్నాయి. బ్రిటీష్ ఎనర్జీ దిగ్గజాలు షెల్, బీపీ నుంచి ఫ్రెంచ్ కారు తయారీదారి రెనాల్ట్ వరకు రష్యా నుంచి వైదొలిగాయి. అయితే మెక్‌డొనాల్డ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా వందకి పైగా దేశాలలో 39 వేల ప్రాంతాలలో రెస్టారెంట్లు ఉన్నాయి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ