US Recession: మరో భయంకరమైన బ్యాడ్‌న్యూస్‌.. ఇప్పుడిక అమెరికా వంతు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

US Recession: అసలే ఉక్రెయిన్‌ యుద్ధంతో మన బతుకులు భారం అయ్యాయని అనుకుంటే, మరో భయంకరమైన బ్యాడ్‌న్యూస్‌కు మనం సిద్ధంగా ఉండాల్సిందే.

US Recession: మరో భయంకరమైన బ్యాడ్‌న్యూస్‌.. ఇప్పుడిక అమెరికా వంతు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Us
Follow us
Shiva Prajapati

|

Updated on: May 17, 2022 | 7:33 AM

US Recession: అసలే ఉక్రెయిన్‌ యుద్ధంతో మన బతుకులు భారం అయ్యాయని అనుకుంటే, మరో భయంకరమైన బ్యాడ్‌న్యూస్‌కు మనం సిద్ధంగా ఉండాల్సిందే. ఈసారి బ్యాడ్‌న్యూస్‌ అగ్రరాజ్యం నుంచి వస్తోంది. అమెరికా హై రిస్క్‌లో ఉంది. ఇదే ఇప్పుడు షాకింగ్‌ న్యూస్‌. అప్పుడెప్పుడో ఒబామా హయాంలో ఆర్థికమాంద్యంలో కూరుకున్న అమెరికా, ఇప్పుడు మళ్లీ డెమొక్రాట్‌ అయిన బైడెన్‌ జమానాలో ముప్పు ముంగిటకు వచ్చింది. అమెరికా మరో ఆర్థికమాంద్యం దిశగా అడుగులు వేస్తోందని ఆ దేశానికి చెందిన ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ హెచ్చరించింది. అమెరికా ఇప్పుడు వెరీ వెరీ హై రిస్క్‌లో ఉన్నట్లు ఆ కంపెనీ చైర్మన్‌- లాయిడ్‌ బ్లాంక్‌ఫీన్‌ ఒక టీవీ కార్యక్రమంలో చెప్పడం ప్రకంపనలు పుట్టిస్తోంది.

కంపెనీలన్నీ ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అమెరికా GDP రేటు 2.6 నుంచి 2.4శాతానికి పడిపోతుందనీ, 2023 అంచనాలు 2.2 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయాయని చెప్పారాయన. అమెరికాలో ఆర్థికమాంద్య ముప్పునకు ప్రధాన కారణాల్లో ద్రవ్యోల్బణం ఒకటి. మార్చినెలలో ద్రవ్యోల్బణం 8.5 శాతాన్ని తాకింది. అక్కడి సెంట్రల్‌ బ్యాంక్‌ టార్గెట్‌ మాత్రం రెండు శాతమే. తాజాగా గోల్డ్‌మన్‌ శాక్స్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అక్కడి స్టాక్‌మార్కెట్లు వణికిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఈ ఆర్థికమాంద్యాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే అమెరికాలో మాంద్యం వస్తే ఆ ప్రభావం ప్రపంచ స్టాక్‌మార్కెట్ల మీద కూడా ఉంటుందన్నదే అసలుపాయింట్‌.