AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srilanka Crisis: తినటానికి తిండి లేదు.. జీతాలివ్వటానికి చిల్లిగవ్వలేదు.. అంధకారంలో అల్లాడుతున్న లంక..

Srilanka Crisis: లంకంత కష్టంలో కూరుకుపోయిన ద్వీప దేశంలో ఆర్థిక కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. వరుస సమస్యలు ఆ దేశాన్ని చుట్టుముడుతున్నాయి. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని అధికార నేతల ఇళ్లను తగలబెట్టేదాకా అది వెళ్లింది.

Srilanka Crisis: తినటానికి తిండి లేదు.. జీతాలివ్వటానికి చిల్లిగవ్వలేదు.. అంధకారంలో అల్లాడుతున్న లంక..
Srilanka Crisis
Ayyappa Mamidi
|

Updated on: May 17, 2022 | 12:50 PM

Share

Srilanka Crisis: లంకంత కష్టంలో కూరుకుపోయిన ద్వీప దేశంలో ఆర్థిక కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. వరుస సమస్యలు ఆ దేశాన్ని చుట్టుముడుతున్నాయి. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని అధికార నేతల ఇళ్లను తగలబెట్టేదాకా అది వెళ్లింది. ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వం పరిస్థితులను తిరిగి గాడిలోకి తెచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో ఒకటి ఏమిటంటే.. ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను కాపాడేందుకు ఎయిర్ లైన్స్‌ను అమ్మేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. విమానయానాన్ని ప్రైవేటీకరించిన తర్వాత కూడా నష్టాలను లంక ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటి వరకు ఎన్నడూ విమానం ఎక్కని వారు సైతం ఆ రెక్కల భారాన్ని మోయక తప్పని పరిస్థితి అక్కడ నెలకొంది.

అధ్యక్షుడు గొటబయ రాజపక్ష తెచ్చిన డెవలప్‌మెంట్ బడ్జెట్ స్థానంలో.. రిలీఫ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రీమియర్ హామీ ఇచ్చారు. గొటబయ బడ్జెట్ కారణంగానే శ్రీలంక ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఏడాది చివరి నాటికి జీడీపీలో బడ్జెట్‌ డెఫిసిట్ 13 శాతం ఉండొచ్చని ప్రధాని విక్రమసింఘే అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో సమస్యల సుడిగుండం నుంచి తప్పించుకోవటానికి నిధులు అత్యవసరం. అందుకే ప్రపంచ దేశాల నుంచి ఆపన్న హస్తం కోసం లంక ఎదురుచూస్తోంది. ఇందుకోసం భారత్, చైనా నుంచి లోన్స్ తీసుకోవాలనుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది జరగాలంటే ముందుగా రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. ఇదే సమయంలో కేవలం కొన్ని గంటలకు మాత్రమే సరిపడా పెట్రోడీజిల్ నిల్వలు ఉండటం అక్కడ ఆందోళన పరిస్థితులకు అద్ధం పడుతోంది. కొలంబో రేవు బయట ఆయిల్ షిప్‌మెంట్లు ఉన్నప్పటికీ చెల్లింపులు చేయకుండా వాటిని వినియోగించటం అస్సలు కుదరదు.

రానున్న మరికొద్ది నెలల్లో ప్రజలు మరింత గడ్డు పరిస్ధితిని ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతరించిపోవడంతో తీరం వెంబడి ఇంధన నిల్వలు ఉన్నా వాటిని తెప్పించుకునే పరిస్థితులు లేవని తెలుస్తోంది. కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో శ్రీలంక ఉంది.  ఈ తరుణంలో ప్రజలకు చేతులెచ్చి జోడించటం తప్ప మరేమీ చేయలేని స్థితిలో ఉన్నట్లు కొత్త ప్రధాని వెల్లడించారు. ఈ సమయంలో కరెన్సీని ముద్రించి చలామణీలోకి ఎక్కువగా తెస్తే ద్రవ్యోల్బం మరింత పెరిగి వెనెజువలా దేశంలోని పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కరెంటు కష్టాల గురించి చెప్పుకోనక్కర్లేదు. రోజులో కనీసం 15 గంటలు పవర్ కట్స్ జనజీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ నెలకు 14 లక్షల మంది సివిల్ సర్వెంట్ల జీతాలు ప్రభుత్వం చెల్లించలేదు. తప్పక కరెన్సీ ముద్రణ చేస్తున్న లంక దేశం.. నష్టాల్లో ఉన్న కంపెనీలను తెగనమ్మేందుకు సిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఫ్యూయల్‌, విద్యుత్‌ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రజల సహకారంతోనే పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్లు శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ పరిస్థితులు ఇంకెంత కాలం కొనసాగుతాయనే ఆందోళనలో అక్కడి ప్రజలు ఉన్నారు.