World Hypertension Day 2022: ఈ 6 పండ్లు రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయి..!

World Hypertension Day 2022: అధిక లేదా తక్కువ రక్తపోటు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. రక్త పోటు కారణంగా.. హార్ట్ స్ట్రోక్ వంటి పరిణామాలు..

World Hypertension Day 2022: ఈ 6 పండ్లు రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయి..!
World Hypertension Day 2022
Follow us

|

Updated on: May 17, 2022 | 9:41 AM

World Hypertension Day 2022: అధిక లేదా తక్కువ రక్తపోటు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. రక్త పోటు కారణంగా.. హార్ట్ స్ట్రోక్ వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్తపోటుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 17వ తేదీన ప్రపంచ హైపర్ టెన్షన్ డే ని జరుపుకుంటారు. అయితే, రక్తపోటు నియంత్రణలో మనం తినే ఆహారమే అత్యంత ప్రభావితం చూపుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఆహార పదార్థాలతో రక్తపోటు సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు. ముఖ్యంగా 6 రకాల పండ్లు రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కివి: కివిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ మొదలైన వాటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పుచ్చకాయ: వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పనిచేస్తుంది. ఇందులో అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, అమైనో ఆమ్లాలు, లైకోపీన్ ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మామిడి: మామిడిని పండ్లలో రారాజు అంటారు. మామిడిని వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. ఇది చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైనది. ఇందులో ఫైబర్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీ: పిల్లలు ఈ పండును తినడానికి బాగా ఆసక్తి చూపుతారు. దీన్ని తిన్న తర్వాత చాలా ఫ్రెష్‌గా ఉంటారు. ఇందులో విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

అరటిపండు: అరటిపండులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

కొబ్బరి, కొబ్బరి నీరు: కొబ్బరి లేదా కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహించడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తాగండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ