Ghee: కూరగాయలు.. పప్పుల్లో నెయ్యి వేస్తున్నారా ? అయితే నిపుణులు చెబుతున్న ఈ విషయాలు తెలుసుకోండి..
కూరగాయలు, పప్పులలో నెయ్యి ఉపయోగించడం వలన దాని లక్షణాలు తగ్గుతాయట. గట్ హెల్త్ ఎక్స్ ఫర్డ్.. న్యూట్రిషనిస్ట్ అవంతి దేశ్ పాండే ఇటీవల తన సోషల్ మీడియోలో ఓ వీడియోను షేర్ చేశారు.
నెయ్యి.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలను అందిస్తుందో తెలిసిన విషయమే (Ghee). ఇక మన భారతదేశంలో నెయ్యి లేకుండా చాలా మంది వంటలు చేయరు.. నెయ్యి నేరుగా శారీరక బలంతో ముడిపడి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే కూరగాయలు, పప్పులలో నెయ్యి ఉపయోగించడం వలన దాని లక్షణాలు తగ్గుతాయట. గట్ హెల్త్ ఎక్స్ ఫర్డ్.. న్యూట్రిషనిస్ట్ అవంతి దేశ్ పాండే ఇటీవల తన సోషల్ మీడియోలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో కూరగాయలు, పప్పులను చేయడానికి నెయ్యిని ఉపయోగించవద్దని తెలిపారు. వేడి చేసే సమయంలో నెయ్యికి బదులుగా నూనెను ఉపయోగించాలని సలహా ఇచ్చారు.
చాలా మంది కూరగాయలు చేసేటప్పుడు వేయించడానికి నెయ్యిని ఉపయోగిస్తున్నారు.. పోషకాహార నిపుణుడు అవంతి ప్రకారం.. ఇది అస్సలు మంచిది కాదట.. నెయ్యి ఒక సంతృప్త కొవ్వుు.. అంటే నూనెతో పోలిస్తే నెయ్యి స్మోక్ పాయింట్ తక్కువగా ఉంటుంది. కూరగాయలు వండేటప్పుడు, అది విచ్ఛిన్నమవుతుంది అలాగే దాని పోషక నాణ్యత తగ్గుతుందని తెలిపారు..
నెయ్యిని రోటీలో వేసి.. అన్నం లేదా పప్పులో కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కూరగాయాలు లేదా టెంపరింగ్ చేయడానికి నెయ్యికి బదులుగా వేరుశనగ నూనె.. సన్ ఫ్లవర్ ఆయిల్.. సఫోలా ఆయిల్ వంటి అధిక పొగ పాయింట్ ఉన్న వంట నూనెలను ఉపయోగించాలని తెలిపారు. అవు నెయ్యి ఆరోగ్యపరంగా మంచిదే.. గేదె నెయ్యిని ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారని మనకు తెలిసిన విషయం.. సరైన పద్దతిలో నెయ్యి తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
గమనిక: – ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. అభిప్రాయాలు ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.