Health Tips: ఈ 4 హెర్బల్ టీలు బీపీని కంట్రోల్ చేస్తాయి.. తప్పకుండా ట్రై చేయండి..!
Health Tips: ఆధునిక జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు. వారు నిత్యం మందుల సాయంతో జీవితాన్ని గడపాల్సి వస్తోంది.
Health Tips: ఆధునిక జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు. వారు నిత్యం మందుల సాయంతో జీవితాన్ని గడపాల్సి వస్తోంది. అలాంటి వారు తమ ఆహారంలో కొన్ని హెర్బల్ టీలని చేర్చుకుంటే మంచిది. వీటి సాయంతో బీపీని తగ్గించుకోవచ్చు. కాబట్టి అటువంటి హెర్బల్-టీల గురించి తెలుసుకుందాం. వాటిలో ముఖ్యమైంది అందరికి తెలిసిన గ్రీన్ టీ. దీనిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అంటే మీరు మీ బీపీని సహజ పద్ధతిలో నియంత్రించుకోవచ్చు. ఖచ్చితంగా గ్రీన్ టీని మీ డైట్‌లో చేర్చుకోండి.
మందార టీ
మందార టీతో పెరిగిన బీపీ అదుపులో ఉంటుంది. ఈ టీలో గ్రీన్ టీ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అయితే దీనిని తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీ శరీరానికి సరిపోతుందా లేదా అనేది నిర్దారించుకోవాల్సి ఉంటుంది.
ఊలాంగ్ టీ
ఊలాంగ్ టీ అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. మీరు దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిని రోజూ తీసుకుంటారు. ఇది యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇవి అధిక బీపీని తగ్గించడంలో సహాయపడతాయి.
వెల్లుల్లి టీ
వెల్లుల్లి టీ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ టీ చేదుగా అనిపించవచ్చు. కానీ ఇది బీపీ నియంత్రణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కచ్చితంగా డైట్‌లో చేర్చుకునే ప్రయత్నం చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.