Health Tips: పిల్లలకి ఈ రుచికరమైన పాలు తాగించండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు..!
Health Tips: కొంతమంది పిల్లలకి పాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీటి పేరు వినగానే నెమ్మదిగి జారుకుంటారు. అయితే పిల్లలకి ప్రతిరోజు పాల అవసరం ఉంటుంది.
Health Tips: కొంతమంది పిల్లలకి పాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీటి పేరు వినగానే నెమ్మదిగి జారుకుంటారు. అయితే పిల్లలకి ప్రతిరోజు పాల అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు ఏదో ఒకటి చేసి తప్పకుండా వారు పాలు తాగేలా చూడాలి. పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో వారికి అవసరమైన కాల్షియంతో పాటు, ఖనిజాలు, విటమిన్ B12, రిబోఫ్లావిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది పిల్లల మెరుగైన పెరుగుదలకు చాలా అవసరం. అయితే పాలంటే ఇష్టపడని పిల్లలకోసం రుచికరమైన ప్లేవర్ పాలని తయారుచేసి ఇవ్వాలి. బాదం పాలు అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా శిశువుకు మంచి పోషకాలని అందిస్తుంది. పాలలోని పోషక విలువలను కూడా అనేక రెట్లు పెంచుతుంది. వీటి రుచికి పిల్లాడు అలవాటు పడితే ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ పాలని ఏ విధంగా తయారుచేయాలో తెలుసుకుందాం.
బాదం పాలు ఎలా తయారు చేయాలి..?
1. ముందుగా బాదంపప్పును గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి.
2. 10 నిమిషాల తర్వాత బాదం తొక్కను తీసి పక్కన పెట్టుకోవాలి.
3. పొట్టు తీసిన బాదంపప్పును పాలతో కలిపి మిక్సర్‌లో వేయాలి.
4. మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
5. ఇప్పుడు మిగిలిన పాలను పాన్‌లో పోసి తక్కువ మంట మీద 5 నిమిషాలు మరిగించాలి.
6. తరవాత రుబ్బిన బాదంపప్పు, పంచదార అందులో వేసి బాగా కలపాలి.
7. ఇవి కొద్దిగా చిక్కబడే వరకు తక్కువ మంటపై మరిగించాలి.
8. సిద్ధమైన తర్వాత కప్పులో వేసి సర్వ్ చేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి