Health Tips: ఉదయాన్నే టీకి బదులు ఈ 3 డ్రింక్స్‌ తాగితే అస్సలు బరువు పెరగరు..!

Health Tips: చాలామందికి నిద్ర లేవగానే టీ కావాలి. కానీ ఇది మీ బరువును పెంచడానికి పని చేస్తుంది. టీ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది టీ తాగడం మానేస్తారు.

Health Tips: ఉదయాన్నే టీకి బదులు ఈ 3 డ్రింక్స్‌ తాగితే అస్సలు బరువు పెరగరు..!
Tea
Follow us
uppula Raju

|

Updated on: May 15, 2022 | 6:25 AM

Health Tips: చాలామందికి నిద్ర లేవగానే టీ కావాలి. కానీ ఇది మీ బరువును పెంచడానికి పని చేస్తుంది. టీ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది టీ తాగడం మానేస్తారు. కానీ కొన్ని రోజులు మాత్రమే. మీరు టీ అలవాటు నిజంగా మానేయాలనుకుంటే వేసవి కాలం మంచి సమయం. ఈ సీజన్‌లో టీకి బదులుగా ఏదైనా రిఫ్రెష్ డ్రింక్ అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మీ బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు టీతో భర్తీ చేయగల కొన్ని డ్రింక్స్‌ గురించి తెలుసుకుందాం.

నిమ్మరసం, వేడి నీళ్లు

నిమ్మరసం బరువు తగ్గడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం. రోజూ లెమన్ వాటర్ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. నిమ్మరసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి.

గ్రీన్ టీ

బరువు తగ్గడానికి మరో బెస్ట్ డ్రింక్ గ్రీన్ టీ. ఇందులో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం టీకి బదులుగా గ్రీన్ టీ తాగితే బరువు సులభంగా తగ్గవచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంపై కొవ్వు పేరుకుపోదు. ఇందులో కొద్దిగా కెఫిన్ ఉంటుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది.

బ్లాక్ కాఫీ

మీకు టీ ఎక్కువగా తాగాలని అనిపిస్తే ఉదయం టీకి బదులుగా బ్లాక్‌ కాఫీ తాగవచ్చు. దీనివల్ల బరువు తగ్గుతారు. ఇందులో కెఫిన్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. పని చేస్తున్నప్పుడు మీకు బద్ధకం అనిపించినప్పుడు మీరు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగవచ్చు. ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. కాఫీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. అయితే బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ మాత్రమే ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Tips: డ్రైవింగ్‌ చేసేటప్పుడు వెన్నునొప్పి వేధిస్తుందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Viral Photos: ప్రపంచంలోనే ప్రమాదకరమైన అడవి.. వెళ్లారంటే తిరిగి రావడం దాదాపు అసాధ్యమే..!

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!