Health Tips: డ్రైవింగ్ చేసేటప్పుడు వెన్నునొప్పి వేధిస్తుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
Health Tips: ఎక్కువ దూరం ప్రయాణించాలంటే చాలా మంది సొంతంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లడానికి ఇష్టపడతారు. ఇది ఖచ్చితంగా అందరికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది.
Health Tips: ఎక్కువ దూరం ప్రయాణించాలంటే చాలా మంది సొంతంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లడానికి ఇష్టపడతారు. ఇది ఖచ్చితంగా అందరికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం అనేది కొంచెం చికాకు కలిగించే పనే. శరీర నొప్పులు, ముఖ్యంగా వెన్నునొప్పి వేధిస్తుంటుంది. అందుకే డ్రైవింగ్ చేయడం ఎవరికైనా అలసటతో కూడుకున్న పని. చాలా సేపు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు వెన్నునొప్పి సమస్య ఉండవచ్చు. దీనికి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. మీరు డ్రైవింగ్ చేసే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలు. కాబట్టి ఈరోజు అలాంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.
స్టీరింగ్ నుంచి సరైన దూరం
సాధారణంగా కొంతమంది సీటుపై కూర్చున్నప్పుడు కొద్దిగా ముందుకు వంగి డ్రైవింగ్ చేస్తారు. దీని కారణంగా వారి చేతుల మధ్య సరైన గ్యాప్ ఏర్పడదు. దీంతో వెన్ను భాగంలో నొప్పి ఉంటుంది. అందుకే మీరు సౌకర్యవంతంమైన ఫీలింగ్ కలిగేవరకు మీ సీటును ముందుకు వెనుకకు కదపండి. ఎయిర్‌బ్యాగ్ పనిచేయాలంటే మీకు స్టీరింగ్ వీల్‌కు మధ్య కనీసం 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలని గుర్తుంచుకోండి.
సీటును చాలా దూరం వెనుకకు వంచవద్దు
కొంత మంది డ్రైవింగ్ సీటును చాలా వెనుకకు వంచి మరింత సౌకర్యంగా కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల సమస్యలు మొదలవుతాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 90° డిగ్రీల కోణం నుంచి ప్రారంభించి 10 నుంచి 20 డిగ్రీల కంటే ఎక్కువ వెనక్కి వెళ్లకూడదు.
సీటు ఎత్తు సర్దుబాటు చేయండి
డ్రైవింగ్ చేసేటప్పుడు నొప్పిని నివారించడానికి సౌకర్యవంతంగా ఉండటానికి మీ ఎత్తును కూడా సర్దుబాటు చేసుకోవాలి. మీ మోకాలు సీటు దిగువకు తగలకుండా చూసుకోండి. అలాగే సీటును చాలా ఎత్తుకు పెంచకండి. ఎందుకంటే ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి