Health Tips: 35 ఏళ్ల తర్వాత అందంగా కనిపించాలంటే ఈ పనులు చేస్తే చాలు..!

Health Tips: 35 ఏళ్ల తర్వాత అందంగా కనిపించాలంటే ఈ పనులు చేస్తే చాలు..!
Skin Care Tips

Health Tips: మీరు 20 ఏళ్లున్నా, 30 ఏళ్లున్నా మెరిసే చర్మం అందరికి అవసరం. అయితే తేడా ఏంటంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు అందంగా కనిపించడానికి

uppula Raju

|

May 14, 2022 | 6:10 AM

Health Tips: మీరు 20 ఏళ్లున్నా, 30 ఏళ్లున్నా మెరిసే చర్మం అందరికి అవసరం. అయితే తేడా ఏంటంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు అందంగా కనిపించడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ వయస్సు పెరిగే కొద్దీ చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. అప్పుడు దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంద విహీనంగా కనిపిస్తారు. వాస్తవానికి 35 ఏళ్లంటే మీరు పెద్ద వయసేమి కాదని అనుకోవచ్చు. కానీ జీవితంలో ఇది ఒక మలుపును సూచిస్తుంది. 30 ఏళ్ల వయస్సుకి వచ్చారంటే మీరు చాలా విషయాలలలో పరిణతి చెందారని అర్థం. అప్పుడు మీ ఆరోగ్యం, చర్మంపై మరింత శ్రద్ధ వహించాలి. డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, మీ చర్మం వృద్ధాప్యానికి గురవుతున్నట్లు సూచిస్తుంది. అయితే మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు 35 సంవత్సరాల వయస్సులో కూడా అందంగా కనిపించవచ్చు.

వాస్తవానికి 35 సంవత్సరాల తర్వాత ముఖంపై వృద్ధాప్యానికి సంబంధించిన కొన్ని ముడతలు కనిపిస్తాయి. అందువల్ల సబ్బు, నీటితో ముఖాన్ని చాలాసార్లు కడగడం మంచిది కాదు. అలాగే రాత్రిపూట క్రీమ్ రాసుకోకుండా చర్మాన్ని అలాగే వదిలేయాలి. రాత్రిపూట కళ్ల చుట్టూ క్రీమ్ రాసుకోవడం మానేసి అలాగే వదిలేయండి. చర్మం జిడ్డుగా ఉంటే క్రీమ్‌లు మరియు మాయిశ్చరైజర్‌లను నివారించండి .

మీరు వాడే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ మీ చర్మ రకాన్ని బట్టి ఉండాలి. 30 ఏళ్లలోపు మహిళలు కాస్మెటిక్స్ వాడకాన్ని పెంచుతారు. ఇది తేమను కోల్పోయేలా చేస్తుంది. దీంతో ముఖంపై ముడతలు ప్రారంభమవుతాయి. రాత్రిపూట అన్ని మేకప్‌లను తొలగించాలి.

ఎండలో తిరిగేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించండి. జిడ్డు చర్మం కోసం సన్‌స్క్రీన్ జెల్ ఉపయోగించండి. రాత్రిపూట చర్మం శుభ్రపరిచిన తర్వాత క్రీమ్‌తో తేలికగా మసాజ్ చేసుకోండి.

చర్మం మెరిసేలా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ముఖ్యం. మీ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, పచ్చి సలాడ్‌లు, మొలకెత్తిన ధాన్యాలు, తృణధాన్యాలు, పెరుగును చేర్చుకోవాలి. రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. ఒక గ్లాసు నీళ్లలో నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేసి ఉదయం పూట తాగాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RCB vs PBKS: చిత్తుగా ఓడిన బెంగుళూరు.. 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన పంజాబ్‌

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది మృతి.. పలువురికి గాయాలు..

Vikram Controversy: కమల్‌ హాసన్‌ విక్రమ్ సినిమా సాంగ్‌పై రచ్చ.. కొన్ని పదాలకి భిన్నమైన అర్థాలు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu