Vikram Controversy: కమల్ హాసన్ విక్రమ్ సినిమా సాంగ్‌పై రచ్చ.. కొన్ని పదాలకి భిన్నమైన అర్థాలు..!
Vikram Controversy: కమల్ హాసన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం విక్రమ్ జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని
Vikram Controversy: కమల్ హాసన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం విక్రమ్ జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని మొదటి పాట ‘పాతాళ పట్టాల’ని విడుదల చేశారు. ఈ పాటలో వాడిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని కొంతమంది వాదిస్తున్నారు. ఈ పాట ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లు కొంతమంది చెబుతున్నారు. కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఈ పాటకు భిన్నమైన అర్థాలు రాబడుతున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ కమల్ హాసన్ 21 ఫిబ్రవరి 2018న మధురైలో మక్కల్ నిధి మయ్యమ్ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
విక్రమ్‌లోని ఈ పాటపై వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఈ పాట సామాన్యులకు బాగా నచ్చుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకి కమల్ హాసన్ డ్యాన్స్ ప్రధాన ఆకర్షణ. ఈ పాటని కమల్ హాసన్ స్వయంగా రాశాడు. అనిరుద్ గాత్రాన్ని అందించాడు. ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 80 లక్షలకు పైగా వీక్షించారు. కమల్ హాసన్ 67 ఏళ్ల వయసులో ఈ పాటలో చూపించిన అద్భుతమైన ఎనర్జీని అభినందిస్తున్నారు.
‘విక్రమ్’ చిత్రానికి లోకేష్ కనగరాజ్ కథ, దర్శకత్వం వహించారు. కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, ఆంటోని వర్గీస్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇది మాత్రమే కాదు, “జై భీమ్” ఫేమ్ నటుడు సూర్య కూడా కమల్ హాసన్ చిత్రం విక్రమ్‌లో అతిధి పాత్రలో కనిపిస్తాడు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తమిళనాడు లేదా సౌత్ రీజియన్‌లోనే కాకుండా పాన్ ఇండియా మొత్తం విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి