CSK vs MI: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు..

CSK vs MI: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

CSK vs MI: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు..
Csk Vs Mi
Follow us
uppula Raju

|

Updated on: May 12, 2022 | 10:59 PM

CSK vs MI: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 98 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. తిలక్ వర్మ 34, రోహిత్‌ శర్మ 18, హృతిక్ షోకీన్ 18పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో చెన్నై బౌలర్లలో ముఖేష్‌ చౌదరీ 3, సిమర్‌జీత్‌ సింగ్‌ 1, మొయిన్‌ అలీ 1 వికెట్‌ సాధించారు. ఈ విజయంతో ముంబయికి పెద్దగా ప్రయోజనం లేదు. అలాగే ఓడిపోయిన చెన్నై కూడా ఇంటిముఖం పట్టక తప్పదు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ముంబై బౌలర్ల దాటికి 97 పరుగులకే చాప చుట్టేసింది. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులేత్తేసింది. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లోకి జారుకుంది. చెన్నై జట్టులో డేవన్‌ కాన్వే, మొయిన్‌ అలీ, తీక్షణ సున్న పరుగులకే వెనుదిరిగారు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్ 7, రాబిన్‌ ఉతప్ప 1, అంబటి రాయుడు 10, శివమ్‌ దూబే 10, డ్వేన్‌ బ్రావో 12, ముకేశ్‌ చౌదరి 4 పరుగులకే పరిమితయ్యారు. ఇక చెన్నై బ్యాటర్లలో ధోనీ చేసిన (36*) పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ధోనీ తర్వాత ఎక్స్ట్రాల రూపంలో వచ్చిన 15 పరుగులే అత్యధికం కావడం విశేషం. ఇక ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ విషయానికొస్తే.. డేనియల్‌ సామ్స్‌ 4 ఓవర్లకు గాను 16 మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మెరిడిత్‌, కుమార్‌ కార్తికేయ చేరో రెండు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, రమణ్‌దీప్‌ సింగ్ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IAF Honey Trap: బుద్ధి గడ్డితిని దేశ భద్రతనే పణంగా పెట్టాడు.. చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు..

YS Viveka: వైఎస్‌ వివేకా హత్యకేసుపై ఏపీ హైకోర్టు కీలక కామెంట్స్‌.. సీబీఐకి సూటి ప్రశ్న..

9 Hours Web Series: డిస్నీ ఫ్లస్ హాట్‏స్టార్‏లో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. 9 అవర్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..