YS Viveka: వైఎస్‌ వివేకా హత్యకేసుపై ఏపీ హైకోర్టు కీలక కామెంట్స్‌.. సీబీఐకి సూటి ప్రశ్న..

YS Viveka: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక కామెంట్స్‌ చేసింది. దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందని

YS Viveka: వైఎస్‌ వివేకా హత్యకేసుపై ఏపీ హైకోర్టు కీలక కామెంట్స్‌.. సీబీఐకి సూటి ప్రశ్న..
Ap High Court
Follow us
Shiva Prajapati

|

Updated on: May 12, 2022 | 10:30 PM

YS Viveka: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక కామెంట్స్‌ చేసింది. దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందని సీబీఐని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ హత్య కేసులో నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరిపింది ఉన్నత న్యాయస్థానం. వివేకా హత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారని, బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరారు పిటిషనర్‌ తరఫు న్యాయవాది.

అయితే, వివేకా హత్య కేసులో కుట్రకోణం దాగి ఉందని, వీరికి బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు సీబీఐ తరఫు న్యాయవాది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు, అసలు సీబీఐ దర్యాప్తు ఎప్పటికి పూర్తి అవుతుందని ప్రశ్నించింది. అయితే, దర్యాప్తు అధికారులను అడిగి వివరాలు కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు సీబీఐ తరఫు న్యాయవాది. దీంతో పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అయితే, బెయిల్‌ పిటిషన్లలో వివేకా కుమార్తె సునీత పిటిషన్‌ కూడా ఇంప్లీడ్ కూడా అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై ఉన్నారని, వీరికి కూడా బెయిల్‌ ఇస్తే కేసు పక్కదారి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు సునీత. ఈ కేసులో ప్రతీ విషయం తనకు తెలియాలని కోరుతోంది. హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఇంకా నిందితులు ఎవరు అనేది తేలకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సునీత. కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఎవ్వరికీ బెయిల్‌ ఇవ్వొద్దని కోరుతోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తుపై కామెంట్స్‌ చేసింది హైకోర్టు.