IAF Honey Trap: బుద్ధి గడ్డితిని దేశ భద్రతనే పణంగా పెట్టాడు.. చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు..

IAF Honey Trap: దేశ రక్షణ రంగంలో పనిచేస్తున్న కీలక ఉద్యోగి అతను. కానీ, బుద్ధి గడ్డితిని దేశ భద్రతనే పణంగా పెట్టారు.

IAF Honey Trap: బుద్ధి గడ్డితిని దేశ భద్రతనే పణంగా పెట్టాడు.. చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు..
Honey Trap
Follow us

|

Updated on: May 12, 2022 | 10:56 PM

IAF Honey Trap: దేశ రక్షణ రంగంలో పనిచేస్తున్న కీలక ఉద్యోగి అతను. కానీ, బుద్ధి గడ్డితిని దేశ భద్రతనే పణంగా పెట్టారు. హానీట్రాప్‌లో చిక్కుకొని, ఆఖరికి కటకటాలపాలయ్యారు.

భారత వైమానిక దళంలో హనీట్రాప్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని, పాకిస్థాన్‌కు చెందిన ఏజెంట్‌కు లీక్‌ చేశాడన్న ఆరోపణలపై, IAFకు చెందిన ఉద్యోగిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. హనీట్రాప్‌లో చిక్కుకుని అత్యంత కీలక సమాచారాన్ని బయటకు పంపించినట్లు చెబుతున్నారు క్రైం బ్రాంచ్‌ పోలీసులు.

IAFలో గూఢచర్యం జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. దీనిపై ఢిల్లీ క్రైం బ్రాంచ్‌, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ రికార్డ్‌ ఆఫీస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న దేవేంద్రనారాయణ్‌ శర్మపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతనిపై ఫోకస్‌ పెట్టిన పోలీసులు, దేవేంద్ర ద్వారానే సమాచారం బయటకు వెళ్తున్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌కు చెందిన మహిళ దేవేంద్రను ట్రాప్‌ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సోషల్‌ మీడియా ద్వారా దేవేంద్రను ట్రాప్‌ చేసినట్లు గుర్తించారు. రక్షణ రంగ కార్యాలయాలు, స్థావరాలు, సిబ్బందికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని దేవేంద్ర సదరు మహిళతో పంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు దేవేంద్రకు డబ్బులు ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

దేవేంద్ర శర్మ నుంచి కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు, ఢిల్లీ పోలీసులు. దేవేంద్రను తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. దేవేంద్ర సంగతి అలా ఉంటే, గతేడాది జులైలో ఆర్మీకి చెందిన ఓ ఉద్యోగి కూడా రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను ఐఎస్‌ఐకి అందించారు. అతడిని కూడా విధుల నుంచి తొలగించి అరెస్టు చేశారు.

ఇలా డబ్బుకోసం, ఇంకా ఇతర అంశాలకు లొంగిపోయి, దేశ భద్రతను పణంగా పెట్టటం కలవరపెడుతోంది. ఇంటెలిజెన్స్‌ అప్రమత్తం చేయకపోతే, ఇంకా కీలక విషయాలు బయటకు వెళ్లేవని అంటున్నారు నిపుణులు. దేశ రక్షణపై మరింత పటిష్టమైన పర్యవేక్షణ అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.