Katrina Kaif: కత్రినా కైఫ్ గర్భవతి కాదంట.. అసలు విషయం ఏంటంటే..?
Katrina Kaif: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని సవాయ్
Katrina Kaif: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ కోటలో వీరి వివాహం జరిగింది. ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. అలాగే గత కొన్ని రోజులుగా కత్రినా 2 నెలల గర్భవతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై కత్రినా కానీ విక్కీ కానీ ఎవ్వరూ స్పందించలేదు. కానీ తాజాగా ఆమె టీం సభ్యులు ఈ వార్తలపై స్పందించారు. కత్రినా గర్భవతి కావడం నిజం కాదన్నారు. ప్రస్తుతం ఆమె తన కెరీర్, విక్కీ జీవితంపై దృష్టి సారించిందని వివరించారు.
వాస్తవానికి ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పింక్ చుడిదార్ వేసుకొని కనిపించినప్పటి నుంచి గర్భిణీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ ఫొటోలో కొంచెం బొద్దుగా కనిపించారు. అంతేకాదు ఆమె నడక తీరు కూడా వేరే విధంగా ఉంది. దీంతో కత్రీనా ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలెట్టారు. ప్రస్తుతం కత్రినా జీ లే జరా, మెర్రీ క్రిస్మస్ సినిమాలు చేస్తున్నారు. కత్రీనా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపపరిచితమే. మల్లీశ్వరి, అల్లరిపిడుగు సినిమాలు చేసిన తర్వాతే బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక విక్కీ కౌశల్ గోవింద మేరా నామ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, లక్ష్మణ్ ఉటేకర్ వంటి చిత్రాలలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
View this post on Instagram