Coronavirus: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే లాంగ్‌ కొవిడ్‌ ఎఫెక్ట్‌ కావొచ్చు.. జాగ్రత్తపడండి..

Long Term Covid Symptoms: కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలామంది ఇంకా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనినే లాంగ్‌ కొవిడ్‌ అని కూడా పిలుస్తున్నారు. ఆందోళన చెందాల్సిన విషయమేమిటంటే.. పెద్దల్లో మాత్రమే కాదు పిల్లల్లోనూ ఈ లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి

Coronavirus: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే లాంగ్‌ కొవిడ్‌ ఎఫెక్ట్‌ కావొచ్చు.. జాగ్రత్తపడండి..
Corona In Children
Follow us
Basha Shek

|

Updated on: May 13, 2022 | 9:15 PM

Long Term Covid Symptoms: కరోనా మహమ్మారి మనతో దోబూచులాడుతోంది. ఇప్పటికే మూడు దఫాలుగా మనల్ని ముప్పుతిప్పలు పెట్టిన ఈ మహమ్మారి ఇంకా మన చుట్టూనే తిరుగుతూ ఉంది. మూడో వేవ్‌ తర్వాత ముగిసిపోయిందనుకున్న కొవిడ్‌ మళ్లీ పడగ విప్పుతోంది. చైనా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా తదితర దేశాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో కూడా అక్కడక్కడ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలామంది ఇంకా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనినే లాంగ్‌ కొవిడ్‌ అని కూడా పిలుస్తున్నారు. ఆందోళన చెందాల్సిన విషయమేమిటంటే.. పెద్దల్లో మాత్రమే కాదు పిల్లల్లోనూ ఈ లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొన్ని నివేదికలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈక్రమంలో పిల్లల్లో కనిపించే లక్షణాలను ముందే పసిగట్టడం ద్వారా లాంగ్‌ కొవిడ్‌ను గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

నీరసం, అలసట..

నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లల్లో అలసిపోవడం లేదా తల తిరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటే వారిలో లాంగ్‌ కొవిడ్‌ ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఒకసారి వైరస్‌ బారిన పడితే శరీరం బలహీనంగా మారుతంది. మహమ్మారి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక పిల్లలైతే త్వరగా అలసిపోతుంటారు. నీరసపడిపోతుంటారు. తరచూ తల తిరగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

తలనొప్పి

లాంగ్ కొవిడ్‌తో బాధపడుతున్న పిల్లలకు తరచుగా తలనొప్పి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తికి కరోనా సోకిన తర్వాత, అతనికి మూడ్ స్వింగ్స్ సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్య పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలుంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లడం మేలు.

గుండె సమస్యలు

కొన్నిసార్లు దీర్ఘకాల కొవిడ్ ప్రభావంతో పిల్లల్లో గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి పిల్లలు చిన్న చిన్న పనులకే అలసిపోతారు. శారీరక శ్రమతో త్వరగా అలసిపోతుంటారు. కొన్నిసార్లు పరిగెత్తడం కూడా కష్టంగా మారుతుంది. దీనివల్ల వారి చదువు కుంటుపడుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తపడడం మేలంటున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

BJP vs TRS: వచ్చుడు.. విషం చిమ్ముడు.. పత్తా లేకుండా పోవుడు.. ఇదే మీ స్ట్రాటజీయా? అమిత్‌షాకు కేటీఆర్‌ ఘాటు లేఖ..

IPL 2022: ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-5 బ్యాటర్లు వీరే.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు..

Sohail Khan: విడాకులు తీసుకోనున్న మరో స్టార్‌ కపుల్‌.. 24 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకనున్న సొహైల్‌ ఖాన్‌ దంపతులు..