- Telugu News Photo Gallery Most Sixes in IPL 2022 Top 5 Batsman Jos Buttler, Andre Russell, Liam Livingstone, Hetmyer, Dinesh Karthik in Telugu
IPL 2022: ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్లు వీరే.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు..
IPL 2022: IPL 2022 తుది దశకు చేరుకుంది. ఎప్పటిలాగానే బ్యాటర్లు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని హోరెత్తిస్తున్నారు. మరి ఇప్పటివరకు సాగిన టోర్నీలో అత్యధిక సిక్సర్లు ఎవరు కొట్టారు? టాప్ 5లో ఎవరున్నారు?
Updated on: May 13, 2022 | 8:15 PM

లియామ్ లివింగ్‌స్టన్: పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న లియామ్ లివింగ్‌స్టన్ అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 11 మ్యాచ్‌లు ఆడిన అతను ఇప్పటివరకు మొత్తం 25 సిక్సర్లు కొట్టాడు.

షిమ్రాన్ హెట్మెయర్: IPL 2022లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లలో షిమ్రాన్ హెట్మెయర్ కూడా ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 11 మ్యాచ్‌ల్లో 21 సిక్సర్లు బాదాడు.

IPL 2022 తుది దశకు చేరుకుంది. ఎప్పటిలాగానే బ్యాటర్లు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని హోరెత్తిస్తున్నారు. మరి ఇప్పటివరకు సాగిన టోర్నీలో అత్యధిక సిక్సర్లు ఎవరు కొట్టారు? టాప్ 5లో ఎవరున్నారు? ఈఐదుగురిలో ఎంత మంది భారత ఆటగాళ్లు ఉన్నారో తెలుసుకుందాం రండి.

దినేష్ కార్తీక్: IPL 2022లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ ఐదో స్థానంలో ఉన్నాడు. బెంగళూరు తరఫున ఆడుతున్న అతను ఈ సీజన్‌లో ఇప్పటివరకు 137 బంతులు ఎదుర్కొని 21 సిక్సర్లు బాదాడు.

జోస్ బట్లర్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. పరుగుల సంఖ్యతో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా అతని పేరు మీదనే ఉంది. బట్లర్ ఇప్పటివరకు 37 సిక్సర్లు కొట్టాడు.

ఆండ్రీ రస్సెల్: అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్ రెండో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను ఇప్పటి వరకు 28 సార్లు బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి తరలించాడు.

ఐపీఎల్ 2022లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లలో ఇండియా నుంచి దినేశ్ కార్తీక్ మాత్రమే ఉన్నాడు.





























