- Telugu News Photo Gallery Cinema photos Actress keerthy suresh open comments on why she accept sister roles
Keerthy Suresh: సిస్టర్ రోల్స్ చేయడం పై క్లారిటీ ఇచ్చిన కీర్తి.. ఆ కారణంతో ఒప్పుకుందట
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కీర్తి సురేష్ (Keerthy Suresh).. సావిత్రి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులను దొచుకుంది.
Updated on: May 13, 2022 | 9:44 PM

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కీర్తి సురేష్ (Keerthy Suresh).. సావిత్రి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులను దొచుకుంది.

ఈ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది.

తాజాగా సూపర్ స్టా్ర్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాత్రలో నటించింది కీర్తి. ఈరోజు విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

మరోవైపు కీర్తి సురేష్ ఇదే దారిలో వెళ్తున్నారు. సర్కారు వారి పాట తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కీర్తి. వరసగా సినిమాలు చేయాలని తనకేం లేదని.. 10 పిచ్చి కథలు చేసేకంటే ఓ మంచి సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు ఈ భామ.

ఇటీవల రజినీ కాంత్ నటించిన పెద్దన్న సినిమాలో సూపర్ స్టార్ చెల్లెలిగా నటించి మెప్పించింది కీర్తి .. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలోనూ చిరు చెల్లిగా నటిస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కీర్తి తాను చెల్లి పాత్రలు చేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది.

భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి రోల్స్ వదులుకోవడం ఇష్టంలేదు. అందుకే చెల్లి పాత్రలు చేస్తున్నాను.. మరోకటి.. రజినీకాంత్ సర్ తో నటించాలని ఉంటుంది.. ఆ అవకాశం దొరకడం చాలా కష్టం.. అందుకే పెద్దన్నలో చెల్లి పాత్ర చేశాను..అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడం కష్టం.. పాత్ర ప్రాధాన్యతను బట్టి భోళా శంకర్ సినిమాలో చెల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.




