- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu: doing these mistakes in married life increases the distance between husband and wife
Chanakya Niti: వైవాహిక జీవితంలో ఈ తప్పులు చేస్తే.. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందన్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్య జీవితంలో ఎలా నడుచుకోవాలనే విషయాలను తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. వందల సంవత్సరాల క్రితం ఆచార్య చెప్పిన విషయాలు నేటి తరం కూడా అనుసరించదగినవే. చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించి అమూల్యమైన విషయాలను తెలిపారు.
Updated on: May 13, 2022 | 6:50 PM

అబద్ధం: భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే, అది వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. వారి వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, వారి భాగస్వామిపై నమ్మకం పోతుంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో అనుమానం చోటు చేసుకుంటుంది. అప్పుడు భార్యభర్తల మధ్య సంబంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

నిప్పులో నెయ్యి వేస్తే.. నిప్పు ఎలా పెరిగి.. ఎటువంటి కీడునైనా చేయగలదు. అదే విధంగా కోపంలో ఉన్న వ్యక్తికి మరింత కోపం పెరిగేలా చేయడం ద్వారా ఆ వ్యక్తికీ మరింత కోపం పెరుగుతుంది. తన సమతుల్యతను కోల్పోయి.. తనతో పాటు.. ఇతరుల కూడా హాని కలిగేలా నిర్ణయాలను తీసుకంటారు.

రహస్యాలను పంచుకోవడం: భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో పరిధులుంటాయి. ఎవరి రహస్యాలు వారి దగ్గర మాత్రమే ఉండాలి. భార్యాభర్తలు తమ రహస్య విషయాలను మరొకరితో పంచుకుంటే.. అవి జీవిత భాగస్వామిని కూడా బాధపెడతాయి. అప్పుడు భార్యాభర్తల సంబంధాన్ని బలహీనపరుస్తుంది. తగాదాలకు దారితీస్తుంది.

ఒకరినొకరు కించపరచుకోవడం: భార్యాభర్తల్లో ఎవరైనా చిన్న చిన్న విషయాలను పెద్దది చేసినా ఆ ప్రభావం భార్యాభర్తల బంధంపై పడుతుంది. ఏ విషయంలో భాగస్వామిని కించపరిచినా.. సంబంధం బలహీనపడుతుంది. కొన్నిసార్లు బంధం కూడా తెగిపోవచ్చు. ఏ సంబంధంలోనైనా పరస్పర గౌరవం చాలా ముఖ్యం.

మూడవ వ్యక్తి: భార్యాభర్తలిద్దరూ తమ సంబంధాన్ని పూర్తి నిజాయితీ, చిత్తశుద్ధితో కొనసాగించాలి. దంపతుల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశిస్తే.. ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు. అంతేకాదు దాని ముగింపు చాలా చెడుగా ముగిసే అవకాశం ఉంది.





























