Chanakya Niti: జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను గుర్తుంచుకోండి
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో పాలన, ప్రజల రక్షణ, సంబంధ బాంధవ్యాల గురించి ప్రస్తావించాడు. ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చాణుక్యుడు రచించాడు. అవి నేటికీ అందరికీ ఉపయోగపడతాయని పెద్దల నమ్మకం. ఆచార్య మాటలను అనుసరించడం ద్వారా.. జీవితంలోని పెద్ద సవాళ్లను కూడా అధిగమించవచ్చు.
ఆచార్య చాణక్యుడికి ఎటువంటి కష్టాలనైనా తనకు ఎలా అవకాశంగా మార్చుకోవాలో తెలుసు. ఆచార్య తన అవగాహన , నైపుణ్యంతో కూడిన వ్యూహం కారణంగా మొత్తం నంద రాజవంశాన్ని నాశనం చేసి ఒక సాధారణ బాలుడిని చక్రవర్తిగా చేసాడు. నేటికీ ఆచార్య విధానాల నుండి చాలా నేర్చుకోవచ్చు. జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోమన్నారు.
1 / 5
నిప్పులో నెయ్యి వేస్తే.. నిప్పు ఎలా పెరిగి.. ఎటువంటి కీడునైనా చేయగలదు. అదే విధంగా కోపంలో ఉన్న వ్యక్తికి మరింత కోపం పెరిగేలా చేయడం ద్వారా ఆ వ్యక్తికీ మరింత కోపం పెరుగుతుంది. తన సమతుల్యతను కోల్పోయి.. తనతో పాటు.. ఇతరుల కూడా హాని కలిగేలా నిర్ణయాలను తీసుకంటారు.
2 / 5
ఆనందానికి ఆధారం మతం. మతానికి ఆధారం సంపద. అర్థానికి ఆధారం స్థితి ..అటువంటి స్థితికి ఆధారం ఇంద్రియాలను జయించడమే
3 / 5
తరచుగా అబద్ధాలు చెప్పే వ్యక్తి, ఒక రోజు తన అబద్ధాల వలలో తానే చిక్కుకుంటాడు. అతని అబద్ధం పట్టుబనప్పుడు అతను ఇతరుల నమ్మకాన్ని కోల్పోవడమే కాదు, అతని గౌరవం కూడా కోల్పోతాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ.. అబద్ధాలను ఆశ్రయించకండి
4 / 5
పాలకుడు సమర్థులైన పరిపాలకుల సహాయంతో పాలించాలి. కష్టకాలంలో, రాజు స్వయంగా అన్ని నిర్ణయాలు తీసుకోలేడు. ఆ సమయంలో అర్హత కలిగిన సహాయకులు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆ రాజుకు సహాయపడతారు.