Ram gopal Varma: ఇకపై ఓటీటీ కోసమే సినిమాలు తీసే పరిస్థితి వస్తుంది.. బాలీవుడ్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..

Ram gopal Varma: ప్రస్తుతం బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ సినిమా ఇండస్ట్రీ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాలు దక్షిణాదిలో దుమ్మురేపుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీపై పడింది...

Ram gopal Varma: ఇకపై ఓటీటీ కోసమే సినిమాలు తీసే పరిస్థితి వస్తుంది.. బాలీవుడ్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2022 | 2:32 PM

Ram gopal Varma: ప్రస్తుతం బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ సినిమా ఇండస్ట్రీ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాలు దక్షిణాదిలో దుమ్మురేపుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీపై పడింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌-2 వంటి చిత్రాలు బాలీవుడ్‌లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నిత్యం ఏదో ఒక వార్తలో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ బాలీవుడ్‌ వర్సెస్‌ టాలీవుడ్‌ అంశంపై కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుస కామెంట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేష్‌ బాబు బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలను ఊటంకించిన వర్మ.. బాలీవుడ్‌పై వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు వర్మ. బాలీవుడ్ ఇండస్ట్రీపై తనదైన శైలిలో స్పందించిన వర్మ.. ‘థియేటర్లలో దక్షిణాది చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే.. త్వరలోనే బాలీవుడ్‌ కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయి’ అని వర్మ అన్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం కాస్త మరింత వైరల్‌గా మారింది. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి కొత్త చర్చకు దారి తీశాయి. గత కొన్ని రోజులుగా సౌత్‌ వర్సెస్‌ నార్త్‌ అన్నట్లుగా సాగుతోన్న వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?