Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌ నెంబర్‌వన్‌.. ప్లే ఆఫ్‌లో చేరిన మొదటి జట్టు..

IPL 2022: ఐపీఎల్‌ 2022 ప్లే ఆఫ్‌లో చేరిన మొదటిజట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. పాయింట్ల పట్టికలో నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టు

IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌ నెంబర్‌వన్‌.. ప్లే ఆఫ్‌లో చేరిన మొదటి జట్టు..
Gujarat Titans
Follow us
uppula Raju

|

Updated on: May 11, 2022 | 6:00 AM

IPL 2022: ఐపీఎల్‌ 2022 ప్లే ఆఫ్‌లో చేరిన మొదటిజట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. పాయింట్ల పట్టికలో నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టు అరంగేట్రం నుంచి అద్బుత ప్రదర్శన కొనసాగిస్తుంది. విశేషం ఏంటంటే లక్నో సూపర్ జెయింట్స్‌తో గుజరాత్‌కు గట్టి పోటీ ఎదురైంది. అంతేకాదు ఈ రెండు ఈ సీజన్‌లో కొత్త జట్లే. మంగళవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ చేయడంతో జట్టు 144 పరుగులు చేసింది. తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్ మాయాజాలంతో లక్నో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో 62 పరుగుల తేడాతో గుజరాత్ భారీ విజయం సాధించింది. మొత్తం 18 పాయింట్లు కైవసం చేసుకుని తిరిగి నంబర్ వన్ స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా అవతరించింది.

ఈ విజయంతో గుజరాత్‌కు రెండు పాయింట్లు మాత్రమే కాకుండా రన్ రేట్ (NRR) కూడా మెరుగుపడింది. మరోవైపు లక్నో రన్‌రేట్‌ కొద్దిగా తగ్గింది. పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. అయితే లక్నో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 15న రాజస్థాన్ రాయల్స్‌తో ఉండగా, మే 18న తన చివరి మ్యాచ్‌ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. ప్లే ఆఫ్‌కి చేరుకోవాలంటే రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు సాధిస్తే సరిపోతుంది.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

Viral Video: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. మామూలుగా లేదు ఫైట్‌..!