AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..

AP News: ఏపీ మాజీ మంత్రి నారాయణని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనని చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..
Narayana Arrest
Follow us

|

Updated on: May 11, 2022 | 12:52 AM

AP News: ఏపీ మాజీ మంత్రి నారాయణని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనని చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరుస్తారు. తర్వాత నారయణని ఈ రాత్రికి చిత్తూరు సబ్‌ జైలు ఉంచుతారా లేదా కడపకి తరలిస్తారా అనేది తెలియడం లేదు. ఎప్పటి నుంచి మాల్ ప్రాక్టీస్‌ అని నారయణపై మీడియ ప్రశ్నల వర్షం కురిపించింది. మాట్లాడేందుకు ప్రయత్నించిన నారాయణ ఏమి చెప్పలేకపోయారు.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి నారాయణని పోలీసులు అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు వెంటనే లేఖ రాశారు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశ్యం ఉందన్నారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్‌లు జోడించి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని పేర్కొన్నారు. చిత్తూరు SP వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి అని వెంటనే ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చెయ్యాలని కోరారు. కేంద్ర హోం మంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్‌కి కూడా చంద్రబాబు లేఖ రాసారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాలు వరుసగా లీక్‌ అయ్యాయి. ఈ లీకేజీ వెనుక శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

Viral Video: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. మామూలుగా లేదు ఫైట్‌..!

IPL 2022 points table: ప్లే ఆఫ్‌ రేసులో కోల్‌కతా.. ముంబైపై విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు..!

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే