LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

LSG vs GT: ఐపీఎల్ 2022లో భాగంగా ఈ రోజు గుజరాత్ టైటాన్స్‌, లక్నో సూపర్ జెయింట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో భారీ

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో..  62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్
Gt
Follow us
uppula Raju

|

Updated on: May 10, 2022 | 11:20 PM

LSG vs GT: ఐపీఎల్ 2022లో భాగంగా ఈ రోజు గుజరాత్ టైటాన్స్‌, లక్నో సూపర్ జెయింట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఏ మాత్రం పోటీనివ్వలేదు.  కేవలం 82 పరుగులకే ఆలౌట్‌ అయింది. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా జరిగింది. గుజరాత్‌ బౌలర్ల ధాటికి లక్నో బ్యాటర్లు విలవిలలాడారు. ఏ మాత్రం క్రీజులో నిలవలేకపోయారు. దీపక్ హుడా 27 పరుగులు మినహాయించి ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. గుజరాత్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారు. రషీద్‌ ఖాన్‌ 4, యశ్‌ దయాల్‌ 2, మహమ్మద్‌ షమి 1, రషీద్‌ఖాన్‌1 వికెట్‌ సాధించారు. ఈ విజయంతో గుజరాత్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరింది.

అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో శుభమాన్ గిల్ నాలుగో అర్థసెంచరీతో అజేయంగా 63 పరుగులు చేశాడు. లక్నో తరపున ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ గరిష్టంగా రెండు వికెట్లు పడగొట్టాడు. వృద్ధిమాన్ సాహా 11 బంతుల్లో 5 పరుగులు చేసి మొహ్సిన్ ఖాన్‌కు బలయ్యాడు. మాథ్యూ వేడ్ (10) వికెట్ ను అవేశ్ ఖాన్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11) వికెట్ కూడా అవేష్ ఖాన్ కు దక్కింది. డేవిడ్ మిల్లర్ 26 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mumbai Indians IPL 2022: ఐదుసార్లు ఛాంపియన్‌.. ఈ సీజన్ లో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌.. ముంబై వైఫల్యానికి ప్రధాన కారణాలేంటంటే..

BAN vs SL: బంగ్లాదేశ్‌ జట్టులో కరోనా కలకలం.. వైరస్‌ బారిన పడిన స్టార్‌ ఆల్‌రౌండర్‌..

Viral Video: రోడ్డును దాటేందుకు వృద్ధురాలి ఇక్కట్లు.. యువకుడు చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు..