AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డును దాటేందుకు వృద్ధురాలి ఇక్కట్లు.. యువకుడు చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు..

Viral Video: ముఖ్యంగా బిజీగా ఉండే రోడ్లను దాటేందుకు వికలాంగులు, వృద్ధులు, మహిళలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. దురదృష్టం కొద్దీ వారిని పట్టించుకునేవారు అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Viral Video: రోడ్డును దాటేందుకు వృద్ధురాలి ఇక్కట్లు.. యువకుడు చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు..
Basha Shek
|

Updated on: May 10, 2022 | 9:44 PM

Share

Viral Video: ప్రస్తుతం మన జీవితం బిజీబిజీగా మారిపోయింది. పొద్దున్నే లేవగానే ఆఫీస్‌కు వెళ్లేందుకు లేదా ఇతర పనులకు వెళ్లేందుకు తెగ హడావిడి చేస్తుంటారు. అదేవిధంగా పనులు ముగించుకుని సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్లేందుకు తెగ తొందరపడుతుంటారు. ఈక్రమంలో రోడ్లపై రయ్‌రయ్‌ మంటూ వేగంగా వెళ్తుంటారు. అసలు రహదారులపై ఎవరు వెళుతున్నారో కూడా పట్టించుకోకుండా పరుగులు తీస్తుంటారు. ముఖ్యంగా బిజీగా ఉండే రోడ్లను దాటేందుకు వికలాంగులు, వృద్ధులు, మహిళలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. దురదృష్టం కొద్దీ వారిని పట్టించుకునేవారు అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ వృద్ధురాలు రోడ్డు దాటేందుకు తెగ ఇబ్బందులు పడుతుంటుంది. కానీ వాహనాలు మాత్రం రయ్‌రయ్‌మంటూ గ్యాప్‌ లేకుండా దూసుకొస్తున్నాయి. దీన్ని గమనించిన ఓ కుర్రాడు తెలివిగా ఆలోచించాడు. తన బైక్ ను రోడ్డుకు అడ్డంగా ఉంచి వాహనాలన్నింటినీ ఆపేశాడు. దీంతో ఆ వృద్ధురాలు ఎలాంటి భయం లేకుండా రోడ్డును దాటేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. వృద్ధురాలిని రోడ్డు దాటించేందుకు యువకుడు చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అమేజింగ్ వీడియో’, ‘యువకుడు చాలా మంచి పనిచేశాడు’ ‘వాహనదారులు కొంచెం దయతో వ్యవహరించాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Drugs Smuggling: యువతిపై అనుమానంతో మెడికల్ టెస్టులు చేయించిన అధికారులు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!

Sri Lanka Crisis: మహీంద రాజపక్స కుటుంబాన్ని వెంటాడుతోన్న ఆందోళన కారులు.. నేవీ స్థావరంలో  తల దాచుకున్నా..