Viral Video: ఇదెక్కడి స్కూటర్‌రా బాబు.. దానికదే తిరుగుతోంది.. వీడియో చూస్తే షాక్..!
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వింత వీడియోలు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వింత వీడియోలు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తారు. కామెంట్లతో హోరెత్తిస్తారు. తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఒక స్కూటర్ పార్క్ చేసి ఉండటం మనం గమనించవచ్చు. అయితే అది కొద్దిసేపటకి దానంతట అదే తిరుగుతుంది. అలా గుండ్రంగా తిరుగుతూ మళ్లీ పార్కింగ్ చేసిన చోటికే చేరుకుంటుంది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు దీనిని దెయ్యం స్కూటర్‌గా పిలుస్తున్నారు. ఈ వీడియోని ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది చూశారు. 43 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఈ ఘటనను కొందరు అద్భుతం అని, మరికొందరు దెయ్యం చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇప్పడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తప్పకుండా తెలియజేయండి.
View this post on Instagram
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి