Viral Video: నిశ్చితార్ధంలో పవిత్ర బంధంలో సీన్‌ని లైవ్‌లో చూపించిన వరుడు.. ఫన్నీ వీడియో వైరల్..

కొంతమంది స్త్రీలు తమ భర్తల పాదాలను తాకడం మీరు చూసి ఉంటారు. ఈ వైరల్ వీడియోలో కూడా అలాంటి సన్నివేశమే కనిపిస్తుంది.. ఆ తర్వాత ఏమి జరుగుతుందో, ఎవరూ ఊహించి ఉండరు..

Viral Video: నిశ్చితార్ధంలో పవిత్ర బంధంలో సీన్‌ని లైవ్‌లో చూపించిన వరుడు.. ఫన్నీ వీడియో వైరల్..
Funny Video Viral
Follow us
Surya Kala

|

Updated on: May 10, 2022 | 9:27 PM

Viral Video: పెళ్లిళ్ల సీజన్ (Wedding Season) రాగానే సోషల్ మీడియాలో (Social Media) వివాహ వేడుకకి సంబంధించిన వీడియోలు వెల్లువెత్తుతాయి. ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతుంది.. పెళ్లిళ్లలో నెలకొన్న సందడి వీడియోలు సర్వసాధారణంగా అందరినీ ఆకర్షిస్తుంటాయి. సరదాగా డ్యాన్స్‌తో ఫన్నీ వీడియోలు సర్వసాధారణంగా   కనిపిస్తాయి. అలాంటి ఫన్నీ వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఈ వీడియో నిశ్చితార్థానికి సంబంధించినది.. ఇందులో అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు ఉంగరాలు ధరించారు.

కొంతమంది స్త్రీలు తమ భర్తల పాదాలను తాకడం మీరు చూసి ఉంటారు. ఈ వైరల్ వీడియోలో కూడా అలాంటి సన్నివేశమే కనిపిస్తుంది.. ఆ తర్వాత ఏమి జరుగుతుందో, ఎవరూ ఊహించి ఉండరు. నిశ్చితార్థం వాతావరణంలో  అబ్బాయి, అమ్మాయి ముఖాముఖి నిల్చున్నారు. వారి కుటుంబ సభ్యులు,  బంధువులు కూడా వారి పక్కన నిలబడి ఉండటం వీడియోలో మీరు చూడవచ్చు. ఇప్పుడు ఒకరికొకరు ఉంగరాలు ధరించే సమయం వచ్చింది. మొదట, అమ్మాయి తన కాబోయే భర్తకు ఉంగరాన్ని వెలికి తొడిగింది. ఆపై అబ్బాయి పాదాలను తాకుతుంది. దీని తరువాత, అబ్బాయి కూడా అమ్మాయికి ఉంగరాన్ని పెట్టాడు. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్.. అమ్మాయి ఏ విధంగా తన కాళ్ళను తాకిందో.. అదే విధంగా అబ్బాయి కూడా అమ్మాయి పాదాలను తాకడానికి నేల మీదకు వంగాడు. ఇది చూసి అమ్మాయి  నవ్వుతుంది. సాధారణంగా ఇలాంటి తమాషా దృశ్యం చాలా అరుదుగా చోటు చేసుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఇలాంటి సన్నివేశాలు.. పవిత్ర బంధం వంటి సినిమాలో మాత్రమే చూస్తాం..

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో mohan_kushwaha_8555 పేరుతో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటివరకు 1.3 మిలియన్లు అంటే 13 లక్షల వీక్షణలు పొందింది. అంతేకాదు  82 వేల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత నెటిజన్లు  వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఒక నెటిజన్.. వరుడిని ‘అమాయక-బాలుడు’ అని అభివర్ణించాడు.

మరిన్ని వైరల్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే