AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నువ్వు అలా చేస్తే.. నేను ఇలా చేస్తా బాస్.. వేదికపైనే వరుడికి షాకిచ్చిన వధువు..

వివాహ వేడుకలో ఒక్కోసారి బంధువులు చేసే సరదా.. వధువరుల మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలను మనం తరచూ చూసి నవ్వుకుంటుంటాం..

Viral Video: నువ్వు అలా చేస్తే.. నేను ఇలా చేస్తా బాస్.. వేదికపైనే వరుడికి షాకిచ్చిన వధువు..
Wedding Video
Shaik Madar Saheb
| Edited By: Vimal Kumar|

Updated on: May 10, 2022 | 2:40 PM

Share

Wedding Viral Video: సోషల్ మీడియాలో వివాహ వేడుకల్లో వధూవరుల మధ్య జరిగే ఫన్నీ సన్నీవేశాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుంటాయి. వీటిని చూసి మనం అస్సలు నవ్వు ఆపుకోలేము. అయితే.. కొన్ని సంఘటనలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఒక్కోసారి బంధువులు చేసే సరదా.. మరోసారి వధువరుల మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలను మనం తరచూ (Social Media) సోషల్ మీడియాలో చూసి నవ్వుకుంటుంటాం.. తాజాగా.. వివాహ వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో వధూవరులకు సంబంధించినది. అయితే.. దండలు మార్చుకునే సమయంలో వరుడి స్నేహితులు వధువుకు కోపం తెప్పించే పని చేసారు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి వరుడు సహా అతని స్నేహితులందరూ షాకయ్యారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. వేదికపై వధువరులిద్దరూ వివాహ వేదికపై ఉండటాన్ని చూడవచ్చు. వేదికపై వధూవరులతో పాటు, వరుడి స్నేహితులు, అతిథులు కూడా ఉన్నారు. వధువు చేతిలో దండ పట్టుకొని.. వరుడి దగ్గరకు వెళుతుంది. ఈ సమయంలో.. స్నేహితులు వరుడిని ఎత్తుకొని ఇప్పుడు దండ వేయాలంటూ.. వధువును ఆటపట్టిస్తారు. అయితే.. వరుడు చాలా ఎత్తులో ఉండటంతో ఆమెకు వరమాల వేయడం సాధ్యం కాదు. ఈ క్రమంలో పెళ్లికూతురు.. మీరు అలా ఎంత సేపు ఉంటారో ఉండండి.. అంటూ నవ్వుతూ వెనక్కి వెళ్లి సోఫాలో కూర్చుంటుంది. దీంతో వరుడి స్నేహితులు, బంధువులు అంతా నివ్వెరపోయి అలానే చూస్తుండిపోయారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో.. 

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో దుల్హనియా అనే పేజీ షేర్ చేసింది. ఈ సరదా వీడియోను వీక్షించి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, పెళ్లి తర్వాత వరుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:

Cold Water Side Effects: ఎండాకాలంలో అదేపనిగా చల్లని నీరు తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

Fruits for Arthritis: కీళ్ల నొప్పులతో అల్లాడుతున్నారా..? అయితే మూడు పండ్లను తప్పనిసరిగా తినండి..