AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కరోనా బాధితుల్లో దీర్ఘకాలిక సమస్యలు.. పిల్లల్లో కూడా శ్వాసకోశ ఇబ్బందులు.. నిపుణులు ఏమంటున్నారంటే

Coronavirus chronic problems: కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత.. చాలా మంది ప్రజలు వివిధ రకాల దీర్ఘకాలిక ప్రభావాలను, అనారోగ్య సమస్యలను అనుభవిస్తున్నరని అధ్యయనంలో వెల్లడైంది. ఇది పిల్లల్లో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తుంది.

Covid-19: కరోనా బాధితుల్లో దీర్ఘకాలిక సమస్యలు.. పిల్లల్లో కూడా శ్వాసకోశ ఇబ్బందులు.. నిపుణులు ఏమంటున్నారంటే
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: May 10, 2022 | 11:44 AM

Share

Coronavirus chronic problems: కరోనావైరస్ మహమ్మారి నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కోట్లాది మంది ఈ మహమ్మారి బారిన పడగా.. లక్షలాది మంది మరణించారు. ఇంకా కోవిడ్ పలు వేరియంట్ల రూపంలో పంజా విసురుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. మహమ్మారి బారిన పడి కోలుకున్న వారు.. చాలా కాలంపాటు పలు దీర్ఘ కాలిక ప్రభావాలను ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుతం ఈ విషయం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. దాదాపు 10-20 శాతం మంది ప్రజలు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత.. వివిధ రకాల దీర్ఘకాలిక (covid chronic problems) ప్రభావాలను అనుభవిస్తున్నరని అధ్యయనంలో వెల్లడించింది. ఇది సాధారణంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రారంభమైన నాటి నుంచి మూడు నెలల పాటు కనిపిస్తుంది. కనీసం రెండు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొంది. అయితే.. అమెరికా తర్వాత భారతదేశంలో అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు నమోదైన నేపథ్యంలో.. ఇది ఆందోళన కలిగించే విషయమని భారత వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్.. దానితో సంబంధం ఉన్న దీర్ఘకాలిక లక్షణాల మధ్య సంబంధం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసునని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ లీడ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ కోవిడ్ టీమ్, పల్మోనాలజీ, క్రిటికల్ కేర్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎంఎస్ కన్వర్ న్యూస్ 9 తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎంఎస్ కన్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుత మహమ్మారి సమయంలో ప్రజలు కోవిడ్ లక్షణాల దీర్ఘకాలిక ప్రభావాలను ఎదుర్కొంటున్నారన్నారు. ‘‘కొంతమంది మూడు నుంచి నాలుగు వారాల్లోనే కోలుకోగలిగారు, అయితే వారు పూర్తిగా కోలుకున్నారని భావించే వారు మనలోనే చాలా మంది ఉన్నారు. అయితే.. కోవిడ్ నుంచి కోలుకున్న ఒక సంవత్సరం తర్వాత కూడా సమస్యలు వస్తాయి. అలసట, భరించలేని తలనొప్పి, దగ్గు, బ్రెయిన్ ఫాగ్, వెర్టిగో అనే కొన్ని సమస్యలు మాత్రమే ప్రజలు ఫిర్యాదు చేసేవి. దీంతోపాటు హృదయ సమస్యలు.. గుండె నెమ్మదిగా లేదా వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. సుదీర్ఘమైన కోవిడ్‌లో కనిపించే ఒక సాధారణ లక్షణం వాసన, రుచిని కోల్పోవడం. చాలా మందికి రెండు వారాల్లోనే వాసన, రుచి తిరిగి వచ్చినప్పటికీ.. మరికొందరికి నెలల తరబడి ఈ సమస్యలు కొనసాగాయి’’ అని డాక్టర్ కన్వర్ వివరించారు.

ఇవి కూడా చదవండి

కరోనా ముందే దీర్ఘకాలిక సమస్యలు.. 

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వ్యక్తులలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ‘‘ఇందులో శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి ఉన్నాయి. అయితే.. కొందరిలో ఎక్కువ కాలం కోవిడ్ ఎందుకు వస్తుందో గుర్తించడం కష్టం.. కొందరిలో అలా లేదు. కానీ ఇన్‌ఫెక్షన్ సమయంలోనే అజాగ్రత్తగా ఉండటమే దీనికి కారణమని చెప్పలేము’’ అని డాక్టర్ కన్వర్ చెప్పారు.

అయినప్పటికీ.. మంచి పోషకాహారం – ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పండ్లు, ద్రవ పదార్థాలు సుదీర్ఘమైన కోవిడ్ సమస్యల కాల వ్యవధిని తగ్గించడంలో, సంబంధిత ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో సహకరిస్తాయన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. “మాత్రలు సిఫారసు చేయడం సులభం అయినప్పటికీ.. ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి కావున వీటిని సిఫారసు చేయరని తెలిపారు. దీనికి రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడుతుందని డాక్టర్ కన్వర్ అభిప్రాయపడ్డారు.

దీర్ఘకాలిక కోవిడ్‌లో భాగంగా కనిపించే ప్రధాన ఆందోళనకరమైన లక్షణం ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్.. “ఊపిరితిత్తులలో సమస్య ఉన్న చాలా మందిని ఆసుపత్రిలో చేర్చి, వెంటిలేటర్లపై ఉంచవలసి వచ్చిన వారిని మేము చూశాం.. కొంతమందికి ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేయవలసి వచ్చింది. ఇది అటువంటి రోగులకు జీవితకాల పరిణామాలను కలిగిస్తుంది. మరొక ప్రధాన సమస్య ఏంటంటే.. అలాంటి వారి నుంచి తీవ్రమైన జుట్టు రాలడం కనిపించింది. తీవ్రంగా జుట్టు రాలుతున్న రోగులు నా దగ్గరకు వచ్చారు.. అది నియంత్రణలోకి రావడానికి వారికి కొన్ని నెలల సమయం పట్టింది. పురుషులలో నరాలలో రక్త ప్రసరణ నిలిచిపోవడం లాంటి మరో సమస్య కనిపించిందని డాక్టర్ కన్వర్ చెప్పారు.

పిల్లలపై కూడా దీర్ఘకాల కోవిడ్ సమస్యల ప్రభావం..

పెద్దలతో పోలిస్తే పిల్లలలో COVID-19 ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. సమస్యలు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ల కళ్ళు పొడిబారడం, కంటి సమస్యలు గమనించవచ్చు. చాలా కొద్ది మంది తల్లిదండ్రులకు RT-PCR రిపోర్టులో COVID లక్షణాలను చూపిస్తే.. అప్పుడు వారి పిల్లలకు చేస్తారు. అలాగే, సుదీర్ఘమైన కోవిడ్‌కు పరీక్ష అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ పిల్లలలో శ్వాసకోశ సమస్యలు పెరగడం మనం చూశాం. అంతకుముందు వారు ఐదు రోజుల్లో కోలుకుంటే.. ప్రస్తుతం చాలా సమయం పడుతుందని సర్వోదయ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌లోని శిశువైద్యుడు డాక్టర్ సుశీల్ సింగ్లా చెప్పారు.

Also Read:

India Covid-19: గుడ్‌న్యూస్‌.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..

Cold Water Side Effects: ఎండాకాలంలో అదేపనిగా చల్లని నీరు తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..