Potato Farming: మట్టిలో మాత్రమే పండే బంగాళాదుంప.. ఇప్పుడు గాలిలో పండుతుంది.. ఎక్కడంటే..
మట్టిలో పండే బంగాళా దుంపలను గాలిలో పండిస్తూ అద్భుతం చేశాడు ఓ రైతు. తన డాబా మీద, కిచెన్ గార్డెన్‌లో మట్టి అవసరం లేకుండా బంగాళదుంపలు పండిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
మట్టిలో పండే బంగాళా దుంపలను గాలిలో పండిస్తూ అద్భుతం చేశాడు ఓ రైతు. తన డాబా మీద, కిచెన్ గార్డెన్‌లో మట్టి అవసరం లేకుండా బంగాళదుంపలు పండిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని అడాజన్ ప్రాంతానికి చెందిన సుభాష్ వృత్తిరీత్యా ఇంజనీర్. రకరకాల మొక్కలను పెంచడం అతని హాబీ. ఈ క్రమంలో తన ఇంటి టెర్రస్ గార్డెన్‌లో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ.. రకరకాల కూరగాయలు పండిస్తున్నాడు. అయితే మట్టి లో మాత్రమే పండే బంగాళా దుంపను తాను కూడా తన గార్డెన్ లో పండించాలనుకున్నాడు. ఇన్ని కాయగూరల నడుమ సుభాష్ వినూత్నంగా అలోచించి దుంపను గాలిలో పెంచసాగాడు. ఇది అడవి పండు. బంగాళాదుంపలా కనిపిస్తుంది. మట్టి అవసరం లేకుండా తీగపై పెరుగుతుంది. నిజానికి పొటాటో భూమికింద నేలలో పెరిగే కూరగాయ.తరచూ ప్రయాణాలు చేసే సుభాష్ ఒకసారి సౌరాష్ట్రలోని గిర్ అడవులకు వెళ్ళినప్పుడు బంగాళాదుంప విత్తనాలను తీసుకొచ్చాడు. ఈ గాలి బంగాళాదుంపలు కొండప్రాంతాల్లో, అడవుల్లో వాటంతట అవే పెరుగుతాయి. ఈ గాలి పొటాటో శాస్త్రీయ నామం డియోస్కోరియా బల్బిఫెరా. ప్రస్తుతం ఇంటి టెర్రస్ పై ఎటువంటి మట్టి అవసరం లేకుండా గాలికి పెరుగుతున్న బంగాళాదుంప పంట గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ బంగాళా దుంపలను చూడడానికి జనం క్యూ కడుతున్నారు. దీని డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ హవాయి బంగాళాదుంపలు ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా పెరుగుతాయి. వీటి పెంపకానికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. దీని తీగ ఏడాదిలో అనేకసార్లు ఫలాలను ఇస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..