AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: అమ్మ బాబోయ్.. ఎక్కడి నుంచి వస్తారమ్మా .. చూస్తుండగానే ఫోన్ నీళ్లలో..

యూట్యూబ్ ఛానల్స్, రీల్స్ అంటూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ గురించిన పూర్తి వివరాలను నెట్టింట్లో తెలియజేస్తున్నారు.

Viral video: అమ్మ బాబోయ్.. ఎక్కడి నుంచి వస్తారమ్మా .. చూస్తుండగానే ఫోన్ నీళ్లలో..
Viral Video
Rajitha Chanti
|

Updated on: May 10, 2022 | 11:50 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గంటలు గంటలు ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగితేలుతున్నారు చాలా మంది. యూట్యూబ్ ఛానల్స్, రీల్స్ అంటూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ గురించిన పూర్తి వివరాలను నెట్టింట్లో తెలియజేస్తున్నారు. అలాగే.. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇంట్లోనే కాకుండా.. రోడ్డుపై.. ప్రయాణాల్లో.. బస్సులలో.. రైళ్లలో.. కాలేజీలలో ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగోట్టుకున్నవారు చాలా మందే ఉన్నారు. సముద్ర తీరనా.. నది ఒడ్డున.. రైల్వే ట్రాక్ పక్కన.. రోడ్డు మీద .. ఇలా కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలలో రీల్స్ చేస్తూ ఊహించని ప్రమాదానికి గురవుతారు.. మరికొన్నిసార్లు.. విలువైన వస్తువులను పొగోట్టుకుంటారు. తాజాగా ఓ యువతి కూడా రీల్స్ మైకంలో పడి ఖరీదైన ఫోన్‏ను నీళ్లలో పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ యువతి సరస్సు దగ్గర రీల్ చేసేందుకు ప్రయత్నించింది. ముందుగా సరస్సు ఒడ్డున ఓ ట్రిపుల్ స్టాండ్‏కు ఫోన్ పెట్టి సెట్ చేసింది. ఆ తర్వాత తాను కాస్త ముందుకు వెళ్లి మరో బండపై నిల్చుని వెనక్కు తిరిగి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే అప్పటికే ఆ స్టాండ్ తో సహా ఫోన్ కూడా సరస్సులో పడిపోతుంది. ఈ విషయం తెలియని ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూనే ఉంది.. రీల్ చేసిన తర్వాత ఫోన్ వైపు చూడగ్గానే.. అది నీళ్లలో ఉండడం చూసి.. వెంటనే వెళ్లి చట్టుకున్న ఫోన్ తీసేసుకుంది. అయితే అమ్మాయి రీల్ చేయడం అక్కడే ఉన్న మరోకరు వీడియో తీశారు. దీంతో నీళ్లలో కావాలనే ఫోన్ పడేశారా ? కేవలం రీల్ కోసమే ఇలా ఫోన్ పడిపోయేలా చేసారని చూడగానే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగానే చేసిందని.. రీల్స్ కోసం ఫోన్ పడేసిందని.. తెలివితక్కువ మనుషులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

Follow Us
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్
రోజుకో గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు కరిగిపోయి కిలోలు తగ్గుతారు
రోజుకో గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు కరిగిపోయి కిలోలు తగ్గుతారు
విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో వింత ప్రచారం
విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో వింత ప్రచారం
ఇలాంటివాళ్లూ ఉంటారా? రూ. 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ
ఇలాంటివాళ్లూ ఉంటారా? రూ. 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి