Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మేజర్ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2022 | 6:49 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ (Major). శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తి కలిగించాయి. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా వుంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‏లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు..

మహేష్ బాబు మాట్లాడుతూ… “మేజర్ టీమ్ ని చూస్తే గర్వంగా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమషాల మౌనం తర్వాత శేష్ ని హాగ్ చేసుకున్నాను. బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నది, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ భాద్యత ఇంకా పెరుగుతుంది. మేజర్ టీం మొత్తం ఆ భాద్యతని చక్కగా నిర్వహించారు. రెండేళ్ళుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన మేజర్ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న మేజర్ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా గా కూడా అద్భుతంగా ఉండబోతుంది.” అన్నారు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

Rakul Preet Singh: అది సిగ్గుపడాల్సిన విషయం కాదు.. రకుల్ సంచలన కామెంట్స్

KGF Chapter2: ఖండాంతరాలు దాటుతోన్న కేజీఎఫ్‌ ఖ్యాతి.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా అరుదైన రికార్డు..

Thalapathy 66 : దళపతి సినిమాలో సహజ నటి.. విజయ్ 66లో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్