Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న 'ఎంత చిత్రం' పాట
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2022 | 10:21 PM

నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ'(Ante Sundaraniki). ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ సింగిల్ ”ఎంత చిత్రం” పాటని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని సర్ ప్రైజ్ చేసింది. వివేక్ సాగర్ ఈ పాట కోసం వినసొంపైన మెలోడీని కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం చక్కగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. అనురాగ్ కులకర్ణి, కీర్తనా వైద్యనాథన్‌ ఆలాపించిన ఈ పాట మరో చార్ట్ బస్టర్ కావడం పక్కా అనిపిస్తుంది. లిరికల్ వీడియోలో నాని, నజ్రియా నజీమ్‌లా కెమిస్ట్రీ లవ్లీగా వుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌‌కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే