Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

దూకుడు సినిమాలా అనిపించబోతోందా...? అంటే నో అనే అంటున్నారు ఈ సినిమా డైరెక్టర్ పరుశురామ్.

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..
Parasuram
Follow us

|

Updated on: May 10, 2022 | 6:33 AM

మహేష్ మోస్ట్ అవేటెడ్ మూవీ సర్కారు వారి పాట సినిమా ఎలా ఉండబోతోంది. అందరూ అనుకున్నట్టు పోకిరీ సినిమాకు జిరాక్స్ కాపీలా ఉండబోతోందా…? లేక దూకుడు సినిమాలా అనిపించబోతోందా…? అంటే నో అనే అంటున్నారు ఈ సినిమా డైరెక్టర్ పరుశురామ్. తాజాగా టీవీ9తో ఎక్స్‌ క్లూజివ్గా మాట్లాడిన ఈ స్టార్ డైరెక్టర్ సర్కారు వారి పాట ఎంలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చారు. ‘సర్కారు వారి పాట సినిమాను పోకిరీతో పోల్చడంపై మీ అభిప్రాయం ఏంటి.?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు పరశురామ్‌.

‘పోకిరి బయటకు కనిపించిన పోలీస్‌ కథ. ఇది మాత్రం ఒక సాధారణ పౌరుడి కథ. ఇందులో మహేష్‌ మరికొంచెం ఓపెన్‌ అయినట్లు ఉంటారు. ఆయన లుక్‌, మేనరిజం, హావభావాలు చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతారు. మెయిన్ గా మహేష్‌ డ్యాన్స్‌లు ఉర్రూతలూగిస్తాయి’ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్. సూపర్ స్టార్ మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తిచేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

Rakul Preet Singh: అది సిగ్గుపడాల్సిన విషయం కాదు.. రకుల్ సంచలన కామెంట్స్

KGF Chapter2: ఖండాంతరాలు దాటుతోన్న కేజీఎఫ్‌ ఖ్యాతి.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా అరుదైన రికార్డు..

Thalapathy 66 : దళపతి సినిమాలో సహజ నటి.. విజయ్ 66లో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్