AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter2: ఖండాంతరాలు దాటుతోన్న కేజీఎఫ్‌ ఖ్యాతి.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా అరుదైన రికార్డు..

KGF Chapter2: ఇప్పటి వరకు యశ్‌ సినిమా దాదాపు రూ. 1130 కోట్లను రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సినిమా మరో అరుదైన గుర్తింపును అందుకుంది.

KGF Chapter2: ఖండాంతరాలు దాటుతోన్న కేజీఎఫ్‌ ఖ్యాతి.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా అరుదైన రికార్డు..
KGF chapter 2
Basha Shek
|

Updated on: May 09, 2022 | 10:28 PM

Share

KGF Chapter2: కన్నడ రాకింగ్‌ స్టార్‌ (yash) హీరోగా నటించిన సినిమా కేజీఎఫ్: చాప్టర్-2 (KGF Chapter 2). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతనెల ఏప్రిల్‌14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతూ కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు యశ్‌ సినిమా దాదాపు రూ. 1130 కోట్లను రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సినిమా మరో అరుదైన గుర్తింపును అందుకుంది. అదేంటంటే.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ (Seoul)లో కేజీఎఫ్: చాప్టర్-2 చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో దక్షిణకొరియాలో ప్రదర్శితమైన తొలి కన్నడ చిత్రంగా యశ్‌ సినిమా అరుదైన రికార్డు సృష్టించింది.

దీంతో పాటు కరోనా మహమ్మారి అనంతరం దక్షిణ కొరియా దేశంలో విడుదలయిన తొలి ఇండియన్ సినిమాగా కేజీఎఫ్‌2 అరుదైన ఘనతను దక్కించుకుంది. కన్నడతో పాటు హిందీ వెర్షన్‌లను కూడా సౌత్ కొరియాలో ఒకేసారి ప్రదర్శించారు. కాగా బాలీవుడ్లోనూ సంచలనాలు సృష్టిస్తోన్న కేజీఎఫ్‌ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానానికి ఎగబాకిఇంది. ఈ సినిమా హిందీ వెర్షన్ వసూళ్లు ఇప్పటికే 400 కోట్లను దాటాయి. మొదటి స్థానంలో ప్రభాస్‌, రాజమౌళిల బాహుబలి- 2 ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమైన ఆ స్టార్‌ ఆటగాడు..

Viral Video: పెళ్లి మంటపాన్ని ముంచెత్తిన వర్షం.. అయినా వెనకడుగు వేయని వధూవరులు.. ఎలా ఏకమయ్యారో మీరే చూడండి..

Black Raisins: నల్ల ఎండు ద్రాక్షతో అద్భుత ప్రయోజనాలు.. రక్త హీనత, గుండె సమస్యలకు చక్కటి పరిష్కారం..