AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి మంటపాన్ని ముంచెత్తిన వర్షం.. అయినా వెనకడుగు వేయని వధూవరులు.. ఎలా ఏకమయ్యారో మీరే చూడండి..

Funny Video: సోషల్‌ మీడియాలో ఎన్నో పెళ్లి వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని ఎమోషనల్‌గా ఉంటూ క్షణాల్లోనే వైరలవుతుంటే మరికొన్ని ఫన్నీగా ఉంటూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తోంది.

Viral Video: పెళ్లి మంటపాన్ని ముంచెత్తిన వర్షం.. అయినా వెనకడుగు వేయని వధూవరులు.. ఎలా ఏకమయ్యారో మీరే చూడండి..
Basha Shek
|

Updated on: May 09, 2022 | 8:42 PM

Share

Funny Video: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. వీలైనంతవరకు వేడుకగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలనుకుంటారు. పెళ్లి పందిరి దగ్గరి నుంచి డెకరేషన్‌, వంటకాలు, సంగీత్‌లు, ఫొటో సెషన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఘనంగా జరుపుకోవడంపై దృష్టి సారిస్తారు. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. అందుకు తగ్గట్లే సోషల్‌ మీడియాలో ఎన్నో పెళ్లి వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని ఎమోషనల్‌గా ఉంటూ క్షణాల్లోనే వైరలవుతుంటే మరికొన్ని ఫన్నీగా ఉంటూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. బోరున కురుస్తున్న వర్షంలోనే పెళ్లి చేసుకున్నారు ఓ జంట. పెళ్లి మండపమంతా వర్షపు నీటితో నిండి ఉన్నప్పటికీ ఏడుడుగులు నడిచారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

వర్షం ఎంత భారీగా కురుస్తుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు. కల్యాణ మండపం కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఒక వ్యక్తి వాటర్‌ వైపర్‌తో నీటిని బయటకు తోడుతున్నాడు. అయితే వధూవరులు మాత్రం వీటినేమి పట్టించుకోకుండా తమ పెళ్లి పనుల్లో తలమునకలయ్యారు. వర్షపు నీటి మధ్యలోనే వివాహ వేదికను ఏర్పాటుచేసుకుని ఏడడుగులు నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇక ఓ ఫొటోగ్రాఫర్‌ కుర్చీలో కూర్చొని ఈ పెళ్లితంతు ఫొటోలను, వీడియోలను తీస్తుండడం మనం చూడవచ్చు. కాగా ఈ వీడియో చూసిన వారంతా పగలబడి నవ్వుతున్నారు. ఈ పెళ్లి చాలా తమషాగా ఉందని, ఎప్పుడూ ఇలాంటి వివాహాలు చూడలేదని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ వివాహం ఎక్కడ జరిగిందో తెలియట్లేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో బాగా వైరలవుతోంది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘కచ్చితంగా అబ్బాయి, అమ్మాయి కడాయిలో భోజనం చేసి ఉంటారని, అందుకే ఇలా వారి పెళ్లి రోజున వర్షం కురిసింది’, ‘ఈ బోరున వర్షంలో వధూవరులు తమ మేకప్‌ను ఎలా మెయింటైన్‌ చేస్తున్నారో’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also read:

Black Raisins: నల్ల ఎండు ద్రాక్షతో అద్భుత ప్రయోజనాలు.. రక్త హీనత, గుండె సమస్యలకు చక్కటి పరిష్కారం..

Sai Pallavi: న్యాచురల్‌ బ్యూటీ బర్త్‌ డే స్పెషల్‌.. గార్గిగా రానున్నసాయి పల్లవి.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌ లుక్‌..

High Blood Pressure Diet: అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే..