Sai Pallavi: న్యాచురల్‌ బ్యూటీ బర్త్‌ డే స్పెషల్‌.. గార్గిగా రానున్నసాయి పల్లవి.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌ లుక్‌..

Sai Pallavi Birthday: సహజనటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెల్చుకున్న ఈ ముద్దుగుమ్మ నేడు (మే9) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు సినీ తారలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు

Sai Pallavi: న్యాచురల్‌ బ్యూటీ బర్త్‌ డే స్పెషల్‌.. గార్గిగా రానున్నసాయి పల్లవి.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌ లుక్‌..
Sai Pallavi Birthday
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2022 | 5:32 PM

Sai Pallavi Birthday: ప్రేమమ్ సినిమాలోని మలర్‌ పాత్రతో అందరినీ తన వైపు తిప్పుకుంది సాయి పల్లవి(Sai Pallavi). ఆతర్వాత ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో ప్రేక్షకుల్లో చెరగని అభిమానం సంపాదించుకుంది. ఎంసీఏ, పడిపడిలేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సినిమాల్లో ఆమె అభినయానికి అందరూ ముగ్ధులయ్యారు. సహజనటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెల్చుకున్న ఈ ముద్దుగుమ్మ నేడు (మే9) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు సినీ తారలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. కాగా ఈ సొగసరి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె నటిస్తోన్న సినిమాల నుంచి అప్డేట్స్ కూడా రిలీజ్‌ చేస్తున్నారు ఆయా దర్శక నిర్మాతలు. కాగా ఈ మలయాళ ముద్దుగుమ్మ గార్గి (Gargi) అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో నటిస్తోంది. తాజాగాఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో చీరకట్టుతో ఎంతో అందంగా కనిపిస్తోంది సాయి పల్లవి.

కాగా గార్గి సినిమాకు గౌతం రామచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రవిచంద్రన్‌ రామ‌చంద్రన్‌, ఐశ్వర్యా ల‌క్ష్మి, థామ‌స్ జార్జ్‌, గౌత‌మ్ రామ‌చంద్రన్‌ సంయుక్తంగా ఈ ఫీమెల్‌ ఓరియంటెడ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. 96 సినిమాకు స్వరాలందించిన గోవింద్ వ‌సంత ఈ చిత్రానికి మ్యూజిక్ డెరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా అప్‌డేట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సాయిపల్లవి.. ‘ నేను ఈ సినిమా గురించి మాట్లాడటానికి నెలల నుంచి ఎదురుచూస్తున్నా. చిత్ర బృందం ప‌ట్టుబ‌ట్టి మరీ అప్‌డేట్‌ను విడుదల చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఫైనల్‌గా నా పుట్టినరోజునే అందుకు సరైన సందర్భంగా ఎంచుకుంది’ అంటూ రాసుకొచ్చింది. కాగా దీంతో పాటువిరాట పర్వం సినిమాలోనూ నటిస్తోంది సాయిపల్లవి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

High Blood Pressure Diet: అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే..

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీపై మండిపడుతోన్న నెటిజన్లు.. డబ్బు కోసం అలా ఎలా చేస్తావంటూ ట్రోలింగ్‌..

Virat Kohli: గోల్డెన్‌ డక్‌తో కోహ్లీలో ఫ్రస్టేషన్‌.. కోచ్‌ చేసిన పనికి హ్యాట్సాఫ్‌ చెబుతోన్న ఫ్యాన్స్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్