AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీపై మండిపడుతోన్న నెటిజన్లు.. డబ్బు కోసం అలా ఎలా చేస్తావంటూ ట్రోలింగ్‌..

తన అందం, అభినయంతో ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న అలియా భట్ ఓ విషయమై నెట్టింట్లో బాగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ఓ షుగర్‌ కంటెంట్‌ డ్రింక్‌కు సంబంధించిన యాడ్‌లో అలియా నటించడమే ఇందుకు కారణం.

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీపై మండిపడుతోన్న నెటిజన్లు.. డబ్బు కోసం అలా ఎలా చేస్తావంటూ ట్రోలింగ్‌..
Alia Bhatt
Basha Shek
|

Updated on: May 09, 2022 | 4:11 PM

Share

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది బాలీవుడ్‌ బబ్లీ బ్యూటీ అలియా భట్‌ (Alia Bhatt). ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడిగా ఆమె పోషించిన సీత పాత్రకు మంచి పేరొచ్చింది. అంతకుముందు ఆమె నటించిన గంగుబాయి కతియావాడీ సినిమా తెలుగులో కూడా విడుదలై ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ అందాల తార ఓ విషయమై నెట్టింట్లో బాగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ఓ షుగర్‌ కంటెంట్‌ డ్రింక్‌కు సంబంధించిన యాడ్‌లో అలియా నటించడమే ఇందుకు కారణం. కాగా గతంలో ఆమె ఓ కామెడీ షోలో ‘ నేను షుగర్‌ డ్రింక్స్‌ తీసుకోను. అవి ఆరోగ్యానికి హానికరం’ అని స్టేట్‌మెంట్లు ఇచ్చింది. ఇప్పుడు అవే డ్రింక్స్‌ను ప్రమోట్‌ చేయడంపై నెట్టింట్లో నెటిజన్లు మండిపడుతున్నారు. షుగర్‌ డ్రింక్స్‌పై ఆమె గతంలో చెప్పిన మాటలు, ఇప్పటి వ్యాఖ్యలను పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా గతంలో కలంక్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదిత్యారాయ్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌తో కలిసి ది కపిల్‌ శర్మ కామెడీ షోకు అతిథిగా వెళ్లింది అలియా. ఆ సమయంలో ఆమెకు అక్కడ ఓ షుగర్‌ డ్రింక్‌ను ఆఫర్‌ చేయగా.. ‘నేను చక్కెరను తీసుకోను’ అని రిజెక్ట్ చేసింది. అంతేకాకుండా ‘చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు’ అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోకు అలియా నటించిన తాజా యాడ్‌ వీడియోను జోడిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘అలియా షుగర్ డ్రింక్స్‌ తీసుకోదు. కానీ డబ్బు కోసం షుగర్ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తోంది’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఇటీవల తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి అలియా పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. కాగా అలియా, రణ్‌బీర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు డార్లింగ్స్‌, రాకీ ఔర్‌ రానీ కి ప్రేమ్ కహానీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Virat Kohli: గోల్డెన్‌ డక్‌తో కోహ్లీలో ఫ్రస్టేషన్‌.. కోచ్‌ చేసిన పనికి హ్యాట్సాఫ్‌ చెబుతోన్న ఫ్యాన్స్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?