Virat Kohli: గోల్డెన్ డక్‌తో కోహ్లీలో ఫ్రస్టేషన్.. కోచ్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతోన్న ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరల్ వీడియో..
SRH vs RCB, IPL 2022: హైదరాబాద్ బౌలర్ జగదీశ సుచిత్ వేసిన మొదటి బంతికే విలియమన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు కోహ్లీ. ఈ సీజన్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం విరాట్‌కు ఇది మూడోసారి. ఔటైన సందర్భంలో అసహనం, విసుగుతో కలగలిపిన చిరునవ్వుతో ఎంతో నిర్వేదంతో కనిపించాడు కోహ్లీ.
SRH vs RCB, IPL 2022: తన పూర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి అభిమానులను నిరాశపర్చాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) . సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ (SRH vs RCB)లో మొదటి బంతికే వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్ జగదీశ సుచిత్ వేసిన మొదటి బంతికే విలియమన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు కోహ్లీ. ఈ సీజన్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం విరాట్‌కు ఇది మూడోసారి. ఔటైన సందర్భంలో అసహనం, విసుగుతో కలగలిపిన చిరునవ్వుతో ఎంతో నిర్వేదంగా కనిపించాడు కోహ్లీ. నిరాశగా మైదానాన్ని వీడాడు. డ్రెస్సింగ్ రూంలోనూ ఎంతో ఫ్రస్టేషన్‌తో కనిపించాడు. అయితే కోహ్లి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ (Sanjay Bangar) అతడిని ఓదార్చాడు. తల నిమురుతూ ‘మరేం పర్లేదులే’ అన్నట్లుగా భరోసా ఇచ్చాడు.
కోహ్లీ త్వరలోనే ఫామ్ లోకి వస్తాడు..
కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు సంజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ సంజయ్ సర్ మీకు హ్యాట్సాఫ్’, ‘ కోచ్ అంటే ఇలానే ఉండాలి’, ‘కోహ్లీ త్వరలోనే ఫాంలోకి వచ్చేలా చేయండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ విఫలమైనా బెంగళూరు అదరగొట్టింది. 67 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. కెప్టెన్ కెప్టెన్ డుప్లెసిస్ (73 నాటౌట్), పటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్‌వెల్(33).. చివర్లో దినేశ్ కార్తిక్(8 బంతుల్లో 30 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు బెంగళూరు బౌలర్ వనిందు హసరంగ (18/5) ధాటికి నిలవలేకపోయింది. 125 పరుగులకే ఆలౌటై మరో పరాజయాన్ని మూటగట్టుకుంది.
— Diving Slip (@SlipDiving) May 8, 2022
What a gesture by Sanjay Bangar after Kohli’s dismissal. #RCBvsSRH #ViratKohli pic.twitter.com/PHdGEbI0Pj
— Avneet ⍟ (@Avneet_Shilpa) May 8, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: