TS Inter English Exam 2022: ఆ జిల్లాలో గంట ఆలస్యంగా జరుగుతోన్న ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్ష..
తెలంగాణ రాష్ట్రంలోవున్న సూర్యాపేట జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో ఈ రోజు (మే 9) జరగవల్సిన ఇంటర్ పరీక్ష గంట ఆలస్యంగా ప్రారంభమైంది..
TS inter first year english exam begins an hour late at Kodada City Central College: తెలంగాణ రాష్ట్రంలోవున్న సూర్యాపేట జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో ఈ రోజు (మే 9) జరగవల్సిన ఇంటర్ పరీక్ష గంట ఆలస్యంగా ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే.. జిల్లాకు చెందిన కోదాడ సిటీ సెంట్రల్ కాలేజీ (Kodada City Central College)లో ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభంకావల్సిన ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్ష (english exam)ను అక్కడి అధికారులు గంట ఆలస్యంగా ప్రారంభించారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇంగ్లీష్ పేపర్ కి బదులుగా కెమిస్ట్రీ పేపర్ ప్రత్యక్ష మవ్వడంతో ఈ గందరగోలం నెలకొంది. క్వశ్చన్ పేపర్ తారుమారుకావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత ఇంగ్లీష్ పేపర్ విద్యార్ధులకు పంపిణీ చేయడంతో గంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది.
కాగా ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం నేడు ఇంగ్లీష్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం12 గంటల వరకు జరగాలి. క్వశ్చన్ పేపర్ మారడంతో పరీక్ష నిర్వహణ ఆలస్యమైంది. ఇదిలా ఉండగా మే 6 వ తేదీన జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతం, అరబిక్ పేపర్లలో అక్షర దోషాలు దొర్లాయి. మే 7న జరిగిన ఇంటర్ సెకండియర్ తెలుగు క్వశ్చన్ పేపర్‌లో కూడా తప్పులు వచ్చాయి. వాటిని సరిచేసుకొని చదువుకొని జవాబులు రాసేలా విద్యార్థులకు సూచించాలని అధికారులకు ఇంటర్ బోర్డు సమాచారం ఇచ్చింది. దాంతో ఇన్విజిలేటర్లు వాటిని చదివి విద్యార్ధులకు వినిపించారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒక విద్యార్థినికి సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఆ విషయాన్ని పరీక్ష రాసిన అనంతరం ఆ విద్యార్థిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి తండ్రికి చెప్పడంతో, ఆయన ఈ విషయాన్ని పరీక్ష కేంద్రం సిబ్బంది, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఘటనకు బాధ్యులైన ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌లకు డీఐఈవో మెమోలు జారీ చేశారు. కాగా మరో విద్యార్థి హిందీకి బదులుగా సంస్కృతం పరీక్ష రాసి వెళ్లినట్లు తెలిసింది. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు నిర్లక్ష ధోరణిని తప్పుపడుతున్నారు.
Also Read: