Bonus: పిల్లల్ని కనండి.. రూ.11 లక్షల బోనస్‌తోపాటు ఏడాది సెలవులు పొందండి..! ప్రముఖ కంపెనీ సరికొత్త ఆఫర్‌..

పిల్లల్ని కంటే చాలు ఈ కంపెనీ ఉద్యోగులపై వరాల వర్షం కురిపిస్తోంది. రూ.11 లక్షల బోనస్తోపాటు సంవత్సరం పాటు సెలవులు మంజూరు చేస్తోంది. ఎక్కడుంది ఈ కంపెనీ మేము కూడా జాయిన్ అవుతామని అనుకుంటున్నారా..

Bonus: పిల్లల్ని కనండి.. రూ.11 లక్షల బోనస్‌తోపాటు ఏడాది సెలవులు పొందండి..! ప్రముఖ కంపెనీ సరికొత్త ఆఫర్‌..
China Three Child Policy
Follow us
Srilakshmi C

|

Updated on: May 09, 2022 | 12:59 PM

Give birth to a child and earn 11.5 lakhs: ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చి మరీ అధిక సంతానాన్ని కనమని ప్రోత్సహిస్తోంది ఈ దేశ కంపెనీ. ఓ వైపు ప్రపంచంలోనే అధిక జనభాకలిగిన దేశంగా పేరుమోస్తున్నా.. మరో వైపు ప్రోత్సాహకాలు ఇచ్చిమరీ అధిక సంతానాన్ని కనమని చెప్పడంతో ఆగకుండా.. ఈ విధానాన్ని ఏకంగా దేశ పాలసీగా ప్రకటించింది. ఇప్పటికే మీకు అర్థమయ్యింది కదా! అది చైనా దేశమని. అవును.. చైనా (China) ఈ విధమైన నిర్ణయం ఎందుకు తీసుకుందో? దాని వెనుక కథేమిటో తెలుసుకుందాం..

దేశ జనాభాను నియంత్రించేందుకు పెళ్లైన జంటలు ఒకే బిడ్డకు జన్మనివ్వాలనే నిబంధనను 1980లో చైనా ప్రారంభించింది. ఐతే కొన్ని కారణాల రిత్యా.. ఒక బిడ్డను మాత్రమే కనాలనే (one-child policy) నిబంధనను చైనా 2016లో అధికారికంగా రద్దు చేసింది. 2021 మే నెలలో ముగ్గురు పిల్లల పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ద్వారా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆ దేశ ప్రజలను ప్రోత్సహిస్తోంది కూడా. ఐతే ఓ చైనా కంపెనీ మరో అడుగు ముందుకేసి. ఉద్యోగులకు వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. అదేంటంటే.. తమ కంపెనీ ఉద్యోగుల్లో మూడో సంతానానికి జన్మనిచ్చిన ఉద్యోగికి ఏకంగా11.50 లక్షల రూపాయల బోనస్‌ను ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం..

చైనాలోని బీజింగ్‌లో ఉన్న దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్‌ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగుల్లో మూడో సంతానానికి జన్మనిచ్చిన ఉద్యోగికి 90,000ల యువాన్లను బోనస్‌గా ప్రకటించింది. మన దేశ కరెన్సీలో దాదాపు రూ.11.50 లక్షలన్నమాట. తమ కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు బోనస్‌తోపాటు ఒక ఏడాది, పురుషుల కైతే 9 నెలలపాటు సెలవులు కూడా ఇస్తోంది. ఇక రెండో సంతానానికి జన్మనిస్తే 60,000 యువాన్లు (రూ.7 లక్షలు), మొదటి సంతానానికి జన్మనిస్తే 30,000 యువాన్లు (రూ.3.50 లక్షలు) బోనస్‌గా ఇచ్చి, ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది.

నిజానికి వన్ చైల్డ్ పాలసీ వల్ల అప్పట్లో చైనా జనాభా లింగ నిష్పత్తిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పాలసీ కారణంగా దేశంలో వృద్ధుల నిష్పత్తి కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా సింగిల్‌ చైల్డ్‌ పాలసీ వల్ల మగ శిశువులకు అధిక ప్రాధాన్యత పెరగడంతో.. అబార్షన్ల రేటు కూడా పెరిగింది. దీంతో చైనా వన్ చైల్డ్ పాలసీకి 2016 జనవరి 1 న అధికారికంగా స్వస్తి పలికింది. 2020 మే నెల చివరి నాటికి ముగ్గురు సంతానానికి జన్మనివ్వడానికి చైనా అధాకారికంగా అనుమతి తెల్పింది. దీంతో 2020 తర్వాత జనాభా లెక్కల్లో దాదాపు 12 మిలియన్ల జననాలు నమోదయ్యాయి.

Also Read:

TSPSC AMVI Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌! 149 పోస్టులకు త్వరలో మరో నోటిఫికేషన్‌

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!