AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pizza: ఇష్టపడి పిజ్జా ఆర్డర్ చేశాడు.. రెండు ముక్కలు తినగానే గుండె ఆగింది.. ఎందుకంటే..

Pizza: ఆన్​లైన్​లో పిజ్జా ఆర్డర్​ చేసి రెండు ముక్కలు తిన్న వెంటనే 23 ఏళ్ల యువకుడు కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగా అతడు గుండె ఆగి(Cardiac Arrest) చనిపోయాడు.

Pizza: ఇష్టపడి పిజ్జా ఆర్డర్ చేశాడు.. రెండు ముక్కలు తినగానే గుండె ఆగింది.. ఎందుకంటే..
Pizza
Ayyappa Mamidi
|

Updated on: May 09, 2022 | 11:21 AM

Share

Pizza: ఆన్​లైన్​లో పిజ్జా ఆర్డర్​ చేసి రెండు ముక్కలు తిన్న వెంటనే 23 ఏళ్ల యువకుడు కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగా అతడు గుండె ఆగి(Cardiac Arrest) చనిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై రేపు (మంగళవారం) విచారణ ప్రారంభం అవుతోంది. న్యాయం కోసం సదరు యువకుడి తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. జేమ్స్​ అట్కిన్​సన్ అనే యువకుడు​ ఇంగ్లండ్(England) లోని​ న్యూక్యాసిల్​లో నివసించేవాడు. న్యూక్యాసిల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్​లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్​లో నివాసం ఉండేవాడు. 2020 జులై 10న డడ్యాల్ అనే రెస్టారెంట్​ నుంచి డెలివరూ యాప్​ ద్వారా చికెన్ టిక్కా మసాలా పిజ్జాను ఆర్డర్ చేశాడు. కాసేపటికే ఆర్డర్ డెలివరీ తీసుకున్నాడు. తినటం ప్రారంభించి.. రెండు ముక్కలు పూర్తి కాగానే అతడి పెదవులు, గొంతు వాచిపోయాయి. నొప్పితో బాధపడుతూ వెంటనే సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్ 999కి కాల్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే వైద్య సిబ్బంది జేమ్స్ ఇంటికి చేరుకున్నారు. అతనికి ప్రథమ చికిత్సలో భాగంగా రెండు ఇంజెక్షన్లను అందించారు. కానీ.. అప్పటికే జేమ్స్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

జేమ్స్ ను పరిశీలించిన వైద్యులు అతడు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడని.. మరణించినట్లు ధృవీకరించారు. దీనికి కారణం ఏమిటా అని పరిశీలిస్తే.. చిన్నప్పటి నుంచి అతడికి పీనట్ అలర్జీ ఉన్నట్లు తేలింది. జేమ్స్ ఆర్డర్ చేసిన పిజ్లాలో సదరు రెస్టారెంట్ వేరుశెనగ పొడిని వినియోగించినట్లు తేలింది. కానీ.. అతనికి తయారీని దీనిని వినియోగిస్తారని అస్సలు తెలియదు. పిజ్జా తయారీలో అసలు ఏఏ ముడిపదార్ధాలను వినియోగిస్తారో తెలపకపోవటం వల్లనే తన కుమారుడు మృతికి కారణని అతని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డడ్యాల్ రెస్టారెంట్ ఇప్పటికే మూతపడింది.

అలర్జీకి కారణమయ్యే పదార్థాలు వాడితే ఆ విషయాన్ని ఫుడ్ డెలివరీ యాప్​లు స్పష్టంగా చెప్పేలా చూడాలన్నది స్టువర్ట్-జిల్ అంటున్నారు. ఈ విషయంలో న్యాయపోరాటానికి అయ్యే ఖర్చుల కోసం క్రౌడ్​ఫండింగ్ ద్వారా 10వేల పౌండ్లను సమకూర్చుకున్నారు. జేమ్స్​ తరహాలోనే మరణించిన నటాషా తల్లిదండ్రులు నదీమ్-తాన్యా ఎడ్నాన్​ స్టువర్ట్​-జిల్​కు మద్దతుగా నిలుస్తున్నారు. 2016 జులైలో నువ్వులతో చేసిన ఓ వంటకం తిని నటాషా(15) మరణించింది. దీంతో నటాషా తల్లిదండ్రులు.. నటాషా అలర్జీ రీసెర్చ్​ ఫౌండేషన్​ స్థాపించి ఫుడ్​ లేబులింగ్ లో తీసుకురావలసిన మార్పుల గురించి ప్రచారం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి..

Elon Musk: ఎలాన్ మస్క్ మదిలో చావు భయం.. దీనికి రష్యానే కారణమా..!

Stock Market: మార్కెట్లను కుదేలు చేస్తున్న వడ్డీ రేట్ల పెంపు.. వారం ప్రారంభంలోను మారని తీరు..