Stock Market: మార్కెట్లను కుదేలు చేస్తున్న వడ్డీ రేట్ల పెంపు.. వారం ప్రారంభంలోను మారని తీరు..
Stock Market: భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా భారీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచటం వల్ల ఆ ప్రభావం మార్కెట్లను వెంటాడుతూనే ఉంది.
Stock Market: భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా భారీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచటం వల్ల ఆ ప్రభావం మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం కూడా కారణాలుగా తెలుస్తున్నాయి. ఉదయం 9.30 సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ సైతం 230 పాయింట్లను కోల్పోయింది. దీనికి తోడు బ్యాంక్ నిఫ్టీ సూచీ 495 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 540 పాయింట్ల మేర నష్టపోయాయి. మరో పక్క రూపాయి పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితుల్లోనూ ఏప్రిల్ లో కొత్తగా 4,28,000 ఉద్యోగాల కల్పన జరిగినట్లు సానుకూల వార్తలు ఊతం ఇస్తున్నాయి.
యూపీఎల్ లిమిటెడ్ 0.25%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 0.21%, సిప్లా 0.16%, బజాజ్ ఆటో 0.06% మేర ఆరంభంలో పెరిగి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. టెక్ మహీంద్రా 4.81%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.34%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3.13%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.10%, టాటా మోటార్స్ 2.96%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.90%, వేదాంతా 2.71%, టాటా స్టీల్ 2.56%, యాక్సిస్ బ్యాంక్ 2.54%, అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ 2.26% మేర పతనమై ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Aadhaar Number: మీ ఆధార్ నంబర్‌ను మర్చిపోయారా..? సులభంగా తెలుసుకోండి!
Anand Mahindra: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆయన చేసిన పనికి నెట్టిజన్లు ఫిదా..