Apple Credit Card Payments: క్రెడిట్‌ కార్డుల నుంచి చెల్లింపులను నిలిపివేసిన ఆపిల్‌.. ఎందుకంటే..!

Apple Credit Card Payments: ప్రస్తుతం ఏదైనా చెల్లింపులు చేయాలంటే సులభతరం అయ్యాయి. స్మార్ట్ ఫోన్ల నుంచే లావాదేవీలు జరపడం, చెల్లింపులు చేయడం చేసుకోవచ్చు. ఇక ..

Apple Credit Card Payments: క్రెడిట్‌ కార్డుల నుంచి చెల్లింపులను నిలిపివేసిన ఆపిల్‌.. ఎందుకంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 09, 2022 | 9:49 AM

Apple Credit Card Payments: ప్రస్తుతం ఏదైనా చెల్లింపులు చేయాలంటే సులభతరం అయ్యాయి. స్మార్ట్ ఫోన్ల నుంచే లావాదేవీలు జరపడం, చెల్లింపులు చేయడం చేసుకోవచ్చు. ఇక భారత్‌లో ఆపిల్‌ ఫోన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి యాప్‌ల కొనుగోళ్లు, స‌బ్‌స్క్రిప్షన్ల పేమెంట్లను ఆపిల్‌ నిలిపివేసింది. ఈ విధానం జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డుల యాడ్ క్యాంపెయిన్లకు చెల్లింపుల‌ను అనుమ‌తించ‌డం లేదు. గ‌త సంవత్సరం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అమల్లోకి తీసుకొచ్చిన ఆటో డెబిట్ విధాన‌మే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ విధానం వ‌ల్ల రిక‌రింగ్ ఆన్‌లైన్ లావాదేవీల్లో అంత‌రాయం ఏర్పడుతుందని విమర్శలున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన రెగ్యులేష‌న్ల వ‌ల్ల భార‌త్‌లోని బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల నుంచి ఆపిల్ సెర్చ్ యాడ్స్‌కు చెల్లింపుల‌ను అనుమ‌తించ‌బోమ‌ని త‌న యూజర్లకు ఆపిల్‌ ఈ-మెయిల్‌ సందేహాలు చేరవేసింది. జూన్‌ నుంచి భార‌త్‌లోని బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల క్యాంపెయిన్లన్నీ హోల్డ్‌లో ఉంచుతామ‌ని వెల్లడించింది. భార‌త్ బ‌య‌ట బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల‌ను వాడుతూ మీ క‌స్టమ‌ర్లకు యాడ్స్ అందుబాటులోకి తేవాల‌ని సూచించింది.

ఆపిల్‌ తాజా నిర్ణయం వల్ల యూజర్లు ఐ-క్లౌడ్ వంటి ఆపిల్ సబ్‌స్క్రిప్షన్లకు చెల్లింపులు చేయ‌లేక‌పోతున్నారు. ఆపిల్ ఐడీ ఖాతాల నుంచి కూడా పేమెంట్స్ చేయలేక‌పోతున్నారు. గ‌త నెల నుంచి భార‌తీయ యూజ‌ర్లు కేవ‌లం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఉప‌యోగించి ఆపిల్ ఐడీ ఖాతా ద్వారా చెల్లింపులు చేయ‌డానికి అనుమతి ఇస్తుంది. అయినా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

సోషల్‌ మీడియాలో నెటిజన్ల ఫిర్యాదు:

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ విషయంలో ఆపిల్‌ తీసుకువచ్చిన ఈ కొత్త విధానంపై సోషల్‌ మీడియాలో యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయ‌డానికి ప్రయ‌త్నిస్తే దిస్ టైప్ కార్డ్ ఈజ్ నో లాంగ‌ర్ సపోర్టెడ్ అనే మెసేజ్‌లు వ‌స్తున్నాయంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!